Mushfiqur Rahim : ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత.. భారత్‌తో మ్యాచ్‌లోనే అందుకోవాలా..?
వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీం ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Mushfiqur Rahim
Mushfiqur Rahim reaches 1000 run landmark : వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీం ఓ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. పూణే వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రహీం ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహీం వన్డే ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు పూర్తి అయ్యాయి. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
అతడి కంటే ముందు కెప్టెన్, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్‌లో షకీబ్ అల్ హసన్ 32 ఇన్నింగ్స్‌ల్లో 42.89 సగటుతో 1,201 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ముష్ఫికర్ రహీంకు ఇది ఐదో వన్డే ప్రపంచకప్. నేటి మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న రహీం 1 ఫోర్, 1 సిక్స్‌తో 38 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటి వరకు రహీం 32 ఇన్నింగ్స్‌ల్లో 1034 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు 8 అర్థశతకాలు ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో లిట్టన్ దాస్ (66), తాంజిద్ హసన్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. మహ్మదుల్లా 46, ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. శార్దూల్ థాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
Virat Kohli : ఇదీ చూశారా.. 8 ఏళ్ల తరువాత విరాట్ కోహ్లీ బౌలింగ్.. సూపరో సూపర్.. వీడియో వైరల్