IPL 2023: కోహ్లీకి కౌంటర్ ఇచ్చాడా? వైరల్‌గా మారిన నవీన్ ఉల్ హక్ పోస్టు.. స్పందించిన గంభీర్..
’మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని అనుకుంటారో మీరూ అలానే ఉండాలి. మీతో ప్రజలు ఎలా మాట్లాడాలని అనుకుంటారో మీరు అలానే మాట్లాడాలి’ అంటూ నవీన్ ఉల్ హుక్ తన ఇన్ స్టాలో పేర్కొన్నాడు.

naveen ul haq and gambhir
IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. చివరి బంతి వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడుతోంది. మరోవైపు ప్లేయర్ల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈ టోర్నీలో రెండు సార్లు తలపడ్డాయి. రెండుసార్లు కూడా కోహ్లీ – గంభీర్, కోహ్లీ – నవీన్ ఉల్ హుక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బీసీసీఐ ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని ముగ్గురికి జరిమానాలు విధించింది.
Virat Kohli Letter BCCI: నేను చేసిన తప్పేంటి.. భారీ జరిమానాపై బీసీసీఐకి లేఖ రాసిన విరాట్ కోహ్లీ
తాజాగా భారీ జరిమానా( 1.07 కోట్లు) విధించడంతో కోహ్లీ బీసీసీఐ తీరును తప్పుబట్టారు. నేను ఏం తప్పు చేశానని నాకు ఇంతపెద్ద మొత్తం జరిమానా విధించారు? అంటూ బీసీసీఐకి లేఖ రాశాడు. మరోవైపు శనివారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే లక్నో జట్టు పేసర్ నవీన్ ఉల్ హుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్ చేశాడు. ఈ పోస్టుకు గంభీర్ తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్టు వైరల్ గా మారింది. దీంతో నవీన్ ఉల్ హుక్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి పోస్టు చేసినట్లుగా క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.
IPL 2023, DC Vs RCB: సాల్ట్ విధ్వంసం.. బెంగళూరు పై ఢిల్లీ ఘన విజయం
నవీన్ ఉల్ హుక్ తన ఇన్ స్టాలో ఇలా పేర్కొన్నాడు. ‘ మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని అనుకుంటారో మీరూ అలానే ఉండాలి. మీతో ప్రజలు ఎలా మాట్లాడాలని అనుకుంటారో మీరు అలానే మాట్లాడాలి’ అంటూ పోస్టు చేశాడు. దీనికి గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. నువ్వు నీలానే ఉండు.. ఎప్పటికీ మారొద్దు.. అని రిప్లయ్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మద్దతుగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. శనివారం రాత్రి ఈ పోస్టు పెట్టగా ఆదివారం ఉదయంకు 55వేలకుపైగా లైకులు వచ్చాయి.
View this post on Instagram