Ranji Trophy : 9 ఏండ్ల తర్వాత వికెట్ పడగొట్టాడు.. తర్వాత ఏం చేశాడంటే

రంజీ ట్రోఫిలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతిధ్యం వహిస్తున్నాడు. కేరళ తమ తొలి మ్యాచ్ లో మేఘాలయతో తలపడింది. 40వ ఓవర్ వేసిన శ్రీశాంత్ ఆర్యన్ బౌరాను

Ranji Trophy : 9 ఏండ్ల తర్వాత వికెట్ పడగొట్టాడు.. తర్వాత ఏం చేశాడంటే

Sreesanth

Updated On : March 3, 2022 / 12:36 PM IST

Sreesanth : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 సంవత్సరాల తర్వాత వికెట్ తీయడంతో ఆ క్రీడాకారుడి ఆనందం అంతా ఇంతా కాదు… ఉద్వేగానికి లోనైన అతను…పిచ్ పై పడిపోయాడు. దేవుడి దయవల్లే ఇది సాధించాను అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. వికెట్ తీసింది టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్. శ్రీశాంత్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 2013 సంవత్సరంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన శ్రీశాంత్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం రేకేత్తించాయి.

Read More : BCCI: బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్.. డిమోట్‌ అయిన సీనియర్ క్రికెటర్లు

దీంతో అతడిపై బీసీసీఐ జీవితకాలం పాటు నిషేధం విధించింది. దీనిపై సవాల్ చేస్తూ.. న్యాయ పోరాటం చేశాడు శ్రీశాంత్. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శిక్ష కాలాన్ని తగ్గించాలని బీసీసీఐ ఆదేశించింది. దీంతో అతడిపై నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. దీంతో 2020, 13 సెప్టెంబర్ నుంచి అతడిపై నిషేధం ఎత్తివేసింది. అనంతరం రంజీ ట్రోఫిలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతిధ్యం వహిస్తున్నాడు. కేరళ తమ తొలి మ్యాచ్ లో మేఘాలయతో తలపడింది. 40వ ఓవర్ వేసిన శ్రీశాంత్ ఆర్యన్ బౌరాను అవుట్ చేశాడు.

Read More : India vs Sri Lanka: ఇప్పటి వరకు భారత్‌లో గెలవని శ్రీలంక జట్టు.. హెడ్ టూ హెడ్ రికార్డ్ ఇదే!

దీంతో 9 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో తొన తొలి వికెట్ తీశాడు. భావోద్వేగానికి గురై మైదానంలో పడిపోయి సాష్టాంగ ప్రణామం చేశాడు. 9 ఏళ్ల తర్వాత తొలి వికెట్ సాధించాను… దేవుడి దయవల్ల నేను సాధించగలిగినట్లు ట్విట్టర్ శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్ 2022లో శ్రీశాంత్ పేరు నమోదు చేసుకోగా… ఓ ఫ్రాంచైజీ కూడా కొనుక్కొనేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.