IND vs ENG Match : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నఇంగ్లాండ్.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి భారత్ జట్టు
ఇదిలాఉంటే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే మైదానంలోకి దిగాయి. ముఖ్యంగా భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం అయిందని, అతను ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు తుది జట్టులో ఉండడని వార్తలు వచ్చాయి. కానీ..

india vs England
ENG vs IND, World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్లు తలపడుతున్నాయి. లక్నో లోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఐదు మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టులోనూ మ్యాచ్ ను తమవైపుకు తిప్పుకొనే ప్లేయర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలాఉంటే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే మైదానంలోకి దిగాయి. ముఖ్యంగా భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం అయిందని, అతను ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు తుది జట్టులో ఉండడని వార్తలు వచ్చాయి. కానీ, తుది జట్టులో రోహిత్ ఉన్నాడు. మరోవైపు పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని, ముగ్గురు స్పిన్నర్లు ఖాయమని, అశ్విన్ రీ ఎంట్రీ ఉంటుందని భావించినప్పటికీ.. ముగ్గురు పేసర్లతోనే భారత్ మైదానంలోకి దిగింది.
తుది జట్లు ఇలా..
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
కెప్టెన్‌గా రోహిత్‌కు 100వ మ్యాచ్
– భారత్-ఇంగ్లండ్ వరల్డ్‌కప్ మ్యాచ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు వందోది కావడం విశేషం.
– 100 అంతర్జాతీయ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన 7వ భారత్ కెప్టెన్ రోహిత్. ప్రపంచ వ్యాప్తంగా అయితే, 100 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన 49వ కెప్టెన్ రోహిత్.
– రోహిత్ ఇప్పటివరకు 51 టీ20లు, 39 వన్డేలు, 9 టెస్టులకు కెప్టెన్సీ వహించాడు.
https://twitter.com/BCCI/status/1718539655602385390