Hardik Pandya Injury Status : శ్రీలంకతో మ్యాచ్ కు ముందు హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
పాండ్య తిరిగి మెగా టోర్నీలో ఆడతాడా లేదా అన్న విషయం పై అభిమానుల్లో సందేహం నెలకొంది. కాగా.. పాండ్య ఖచ్చితంగా ఈ మెగాటోర్నీలో ఆడతాడని, అయితే.. ఏ మ్యాచ్ ద్వారా

Hardik Pandya Injury Status
ODI World Cup 2023: స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన టీమ్ఇండియా 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టును ప్రస్తుతం ఒక్కటే సమస్య వేధిస్తోంది.. అదే హార్దిక్ పాండ్య గాయం. అక్టోబర్ 19న పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమ చీలమండ గాయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాండ్య బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.
పాండ్య తిరిగి మెగా టోర్నీలో ఆడతాడా లేదా అన్న విషయం పై అభిమానుల్లో సందేహం నెలకొంది. కాగా.. పాండ్య ఖచ్చితంగా ఈ మెగాటోర్నీలో ఆడతాడని, అయితే.. ఏ మ్యాచ్ ద్వారా అతడు బరిలోకి దిగుతాడు అన్న విషయాన్ని ఇప్పుడే స్పష్టం చెప్పలేమని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ముంబైలో శ్రీలంకతో భారత్ మ్యాచ్ కు ముందు పాండ్యా పూర్తి ఫిట్ నెస్, ఎప్పుడు తుది జట్టులో చేరతాడనే విషయాలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. శ్రీలంకతో మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడని రోహిత్ చెప్పాడు.
పాండ్యా ఎంత శాతం గాయం నుంచి కోలుకున్నాడు.? బౌలింగ్ చేస్తున్నాడా? బ్యాటింగ్ చేస్తున్నాడా? గాయం తీవ్రత ఎలా ఉంది అనే విషయాలపై ప్రతీరోజూ మేం వివరాలు సేకరిస్తున్నామని రోహిత్ చెప్పాడు. శ్రీలంకతో మ్యాచ్ తరువాత టీమిండియా ఆదివారం కోల్ కతాలో దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. అయితే, ఆ మ్యాచ్ లో పాండ్యా తుది జట్టులో చేరతాడా అనే విషయంపై రోహిత్ క్లారిటీ ఇవ్వలేదు. ఇది సాధ్యమే.. అయితే, వీలైనంత త్వరగా అతన్ని తుది జట్టులో చూసే అవకాశంఉంటుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి అంతకు మించి నేను ఏమీ చెప్పలేను అంటూ రోహిత్ అన్నారు.
An update from India's captain on a potential #CWC23 return for star all-rounder Hardik Pandya ?
Details ?https://t.co/qy4hbOZvKm
— ICC (@ICC) November 2, 2023