తెలుగు కీర్తి విశ్వవ్యాప్తం…సంబరాల్లో సింధు కుటుంబం

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2019 / 01:28 PM IST
తెలుగు కీర్తి విశ్వవ్యాప్తం…సంబరాల్లో సింధు కుటుంబం

Updated On : August 25, 2019 / 1:28 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేతగా గెలిచిం స్వర్ణం కల సాకారం చేసుకుంది సింధు. స్విట్జర్లాండ్ లోని బసెల్ లో జరిగిన BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో 21-7,21-7తో ఒకుహరా(జపాన్)పై సింధు గెలిచింది. టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలుగా పీవీ సింధు రాకార్డు సృష్టించింది. తెలుగు కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. 

సింధు గెలుపు పట్ల ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న మొదటి ఇండియన్ గా సింధు నిలవడం చాలా సంతోషం కలిగిస్తుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. సింధు విజయాన్ని ఆమె కుటుంబసభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు. గోల్డ్ మెడల్ సింధు అందుకునే క్షణం కోసం ఎదురుచూస్తున్నట్లు సింధు తల్లి విజయ తెలిపారు. సింధు దీని కోసం చాలా కష్టపడిందని ఆమె అన్నారు.