Pakistan : అక్తర్ కుటుంబంలో విషాదం..సంతాపం తెలుపుతున్న క్రీడాకారులు

పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు.

Pakistan : అక్తర్ కుటుంబంలో విషాదం..సంతాపం తెలుపుతున్న క్రీడాకారులు

Updated On : December 26, 2021 / 2:56 PM IST

Pakistan Bowler Shoaib Akhtar : పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్తర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆమె అంత్యక్రియలు ఇస్లామాబాద్ లో జరుగనున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు క్రీడాకారులు షోయబ్ కు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియచేస్తున్నారు. అక్తర్ తల్లి మృతికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ సంతాపం తెలిపారు.

Read More : Bhopal : అనారోగ్యం కారణాలతో బెయిల్…క్రికెట్ ఆడిన వీల్‌‌ఛైర్ ఎంపీ ప్రగ్యాసింగ్

మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన ట్వీట్ చేశారు. షోయబ్ తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారని పాక్ మీడియా పేర్కొంది. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా బంతులు విసరడంలో ఒకరిగా పేరొందారు. అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. 2002లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అక్తర్ గంటకు 161 కి.మీటర్ల వేగంతో బాల్ విసిరాడు. ఈ మాజీ క్రికెటర్ 224 అంతర్జాతీయ మ్యాచ్ లు, 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్ లు ఆడాడు.