PAK vs ZIM: పరాజయాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న పాక్ క్రికెటర్ ..
పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే సంచలన విజయం సాధించడంతో పాక్ అభిమానులతో పాటు ఆటగాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ జింబాబ్వేపై పరాజయాన్ని తట్టుకోలేకపోయాడు. తనలోని ఆవేదనను అదుపుచేసుకోలేక పోయాడు.

Pakistan cricketr
PAK vs ZIM: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్.. జింబాబ్వేపై రెండవ మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఉత్కంఠ భరిత పోరులో 1 పరుగు తేడాతో పాక్ జట్టు ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన జింబాబ్వే ఆటగాళ్లు పాకిస్తాన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో పాయింట్ల పట్టికలో పాక్ వెనుకబడిపోయి సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది.
పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే సంచలన విజయం సాధించడంతో పాక్ అభిమానులతో పాటు ఆటగాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాక్ ఆటగాళ్ల తీరుపై ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ జింబాబ్వేపై పరాజయాన్ని తట్టుకోలేకపోయాడు. తనలోని ఆవేదనను అదుపుచేసుకోలేక పోయాడు.
https://twitter.com/AvinashArya09/status/1585940564838518788?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1585940564838518788%7Ctwgr%5E9841acb81137fb632089d83f3ab9a8ecb242befa%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsports%2Fpak-vs-zim-pakistan-cricketer-breaks-down-after-loss-to-zimbabwe-816656
మ్యాచ్ ఓడిపోగానే షాదాబ్ మోకాళ్లపై కూర్చొని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతన్ని లేపి ఓదార్చిన పాక్ బృందంలోని వ్యక్తి.. షాదాబ్‌ను పక్కకు పంపించాడు.