Pakistan PM Shehbaz Sharif: మిస్ట‌ర్‌ బీన్ వివాదం .. జింబాబ్వే ప్రెసిడెంట్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన పాక్ ప్ర‌ధాని

జింబాబ్వే అభిమానులు ఆశించిన‌ట్లే పాకిస్థాన్‌పై ఆ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో పాక్ జ‌ట్టును వెక్కిరించ‌డం మొద‌లు పెట్టారు. ఈ ఆన్‌లైన్ ట్రోల‌ర్ల‌తో జింబాబ్వే అధ్య‌క్షుడు ఎమ‌ర్స‌న్ కూడా క‌లిసిపోయాడు.

Pakistan PM Shehbaz Sharif: మిస్ట‌ర్‌ బీన్ వివాదం .. జింబాబ్వే ప్రెసిడెంట్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన పాక్ ప్ర‌ధాని

Prime Minister Shehbaz Sharif

Pakistan PM Shehbaz Sharif: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు దెబ్బమీద దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్.. జింబాబ్వేపై రెండవ మ్యాచ్‌లోనూ ఓట‌మిపాలైంది. ఉత్కంఠ భరిత పోరులో 1 పరుగు తేడాతో ఘోర ఓటమిపాలైంది. ఈ ఓట‌మి పాకిస్తాన్ వ‌ర్సెస్ జింబాబ్వే మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చిచ్చు రాజేసింది.

India vs Pakistan T20 Match: పాక్‌పై విజయంతో రికార్డుల మోతమోగించిన టీమిండియా.. అవేమిటో తెలుసా!

పాకిస్థాన్ జ‌ట్టు జింబాబ్వే మ్యాచ్ కోసం ఆట‌గాళ్లు ప్రాక్టిస్ ఫొటోల‌ను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జింబాబ్వే అభిమాని రీట్వీట్ చేశాడు. అస‌లు మిస్ట‌ర్ బీన్‌కు బ‌దులు ఫేక్ బీన్ ను పంపిన విష‌యాన్ని త‌మ దేశ‌స్తులు మ‌ర‌చిపోర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అస‌లు రేప‌టి మ్యాచ్ లో ఈ వ్య‌వ‌హారం సెటిల్ చేస్తామ‌ని పాక్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. జింబాబ్వే అభిమానులు ఆశించిన‌ట్లే పాకిస్థాన్‌పై ఆ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో పాక్ జ‌ట్టును వెక్కిరించ‌డం మొద‌లు పెట్టారు. ఈ ఆన్‌లైన్ ట్రోల‌ర్ల‌తో జింబాబ్వే అధ్య‌క్షుడు ఎమ‌ర్స‌న్ కూడా క‌లిసిపోయాడు. జింబాబ్వే విజ‌యం అద్భుతమ‌ని పేర్కొంటూనే.. వ‌చ్చేసారి మిస్ట‌ర్ బీన్ ను పంపండి అని పాక్‌ను హేళ‌నచేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి ప్ర‌తిగా పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.

మా వ‌ద్ద అస‌లైన మిస్ట‌ర్ బీన్ ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ మా వ‌ద్ద అస‌లైన క్రికెట్ స్ఫూర్తి ఉంది. మా పాకిస్థానీల‌కు అధ్బుతంగా తిరిగి పుంజుకునే త‌మాషా అల‌వాటు కూడా ఉంది మిస్ట‌ర్ ప్రెసిడెంట్ అంటూ పాక్ ప్ర‌ధాని ట్వీట్ చేశాడు. అంతేకాదు.. చివ‌రిలో అభినంద‌న‌లు తెలిపి మీ జ‌ట్టు ఈరోజు నిజంగా బాగా ఆడింది అని పాక్ ప్ర‌ధాని జింబాబ్వే ప్ర‌ధానిని ఉద్దేశించి అన్నారు.  ఇదిలా ఉంటే..  మిస్ట‌ర్ బీన్ వివాదానికి పెద్ద క‌థే ఉంది. 2016లో జింబాబ్వేలో కొన్ని కామెడీ షోలు నిర్వ‌హించ‌గా, అందులో మిస్ట‌ర్ బీన్ ను పోలిన పాక్ హాస్య న‌టుడు ఆసీఫ్ మ‌హ‌మ్మ‌ద్‌ను ఆహ్వానించారు. హ‌రారేలో జ‌రిగిన షోలో అత‌ను మిస్ట‌ర్ బీన్ వ‌లే ఏ విధంగానూ ఆక‌ట్టుకోలేక పోయాడు. దీంతో ఫేక్ మిస్ట‌ర్ బీన్ గా విమ‌ర్శ‌లు పాల‌య్యాడు. అప్ప‌టి నుంచి పాకిస్థాన్, జింబాబ్వే మ‌ధ్య అప్పుడ‌ప్పుడు మిస్ట‌ర్ బీన్ వివాదం తెర‌పైకి వ‌స్తూనే ఉంది.