Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”

టీమిండియా క్రికెటర్ల గురించి, ఐపీఎల్ ప్లేయర్ల గురించి సొంత అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పగలిగే వ్యక్తులలో సెహ్వాగ్ ఒకరు. ఇటీవల యువ క్రికెటర్ పంత్ కు మంచి సపోర్టింగ్ గా ఉంటున్నారు.

Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”

Virender Sehwag (1)

Updated On : May 28, 2022 / 12:01 AM IST

Virender Sehwag: టీమిండియా క్రికెటర్ల గురించి, ఐపీఎల్ ప్లేయర్ల గురించి సొంత అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పగలిగే వ్యక్తులలో సెహ్వాగ్ ఒకరు. ఇటీవల యువ క్రికెటర్ పంత్ కు మంచి సపోర్టింగ్ గా ఉంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన పంత్.. ధోనీ చూసి చాలా నేర్చుకోవాలని సూచిస్తూనే ఇప్పుడు టెస్టు క్రికెట్ ఆడటం మానేస్తే పంత్ ను పట్టించుకోరనేలా కామెంట్ చేశారు.

రిషబ్ పంత్ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడితే.. అతన్ని ఎవరూ గుర్తుంచుకోరని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

‘టెస్టు క్రికెటే అసలైన క్రికెట్. అది ఆడకుంటే పంత్‌ను ఎవరూ గుర్తుంచుకోరు. కోహ్లీకి ఈ విషయం తెలుసు కాబట్టే.. ఎక్కువగా టెస్టులకు ప్రిఫరెన్స్ ఇస్తాడు. 100-150 టెస్టు మ్యాచులు ఆడితే రిషబ్ చరిత్రలో నిలిచిపోతాడు. అందుకే టెస్టు క్రికెట్‌కు అంత ప్రాధ్యానం ఇవ్వాలి’ అని సెహ్వాగ్ వివరించాడు.

ప్రపంచ క్రికెట్లో డ్యాషింగ్ ఓపెనర్ అయిన భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ … తన ధనాధన్ బ్యాటింగ్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రిటైర్ అయిన తర్వాత తన చమత్కారం, సూటి కామెంట్స్‌తో అభిప్రాయాలు పంచుకుంటున్నాడు. తాజాగా భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి ఇలా కామెంట్లు చేశాడు.