PSL : పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. ఏప్రిల్ 11 నుంచి.. పూర్తి షెడ్యూల్ ఇదే..

పాక్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ ప‌దో సీజ‌న్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.

PSL : పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. ఏప్రిల్ 11 నుంచి.. పూర్తి షెడ్యూల్ ఇదే..

PCB announced Pakistan Super League 2025 schedule details here

Updated On : February 28, 2025 / 2:56 PM IST

మ‌న‌దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఐపీఎల్‌ను చూసి చాలా దేశాల్లో ఇలాంటి లీగ్‌లు పుట్టుకొచ్చాయి. అయితే.. అవేవీ ఐపీఎల్‌కు సాటి రావ‌డం లేదు. మ‌న పొరుగు దేశం ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)ను తీసుకువ‌చ్చింది. 2016లో ఈ లీగ్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సీజ‌న్లు పూర్తి అయ్యాయి. తాజాగా ప‌దో సీజ‌న్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.

పీఎస్ఎల్ ప‌దో సీజ‌న్ ఏప్రిల్ 11 నుంచి మే 18 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 11న ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, రెండుసార్లు ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. మొత్తం 6 జ‌ట్లు పాల్గొన‌నుండ‌గా 34 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

AUS vs AFG : ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దైతే.. భార‌త్‌కు లాభ‌మా, న‌ష్ట‌మా?

లాహోర్‌లోని గడాఫీ స్టేడియం రెండు ఎలిమినేటర్లు, ఫైనల్ మ్యాచ్ సహా 13 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం ఓ క్వాలిఫయర్ మ్యాచ్ సహా 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తోంది. కరాచీలోని నేషనల్ స్టేడియం, ముల్తాన్ లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఒక్కొక్కటి ఐదు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తాయి. ఈ సీజ‌న్‌లో మూడు డబుల్ హెడర్ మ్యాచ్ మాత్ర‌మే ఉన్నాయి.

పీఎస్ఎల్ 2025.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఏప్రిల్ 11 – ఇస్లామాబాద్ యునైటెడ్ vs లాహోర్ ఖలందర్స్ – రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 12 – పెషావర్ జల్మి vs క్వెట్టా గ్లాడియేటర్స్ – రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 12 – కరాచీ కింగ్స్ vs ముల్తాన్ సుల్తాన్స్ – నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 13 – క్వెట్టా గ్లాడియేటర్స్ vs లాహోర్ ఖలందర్స్ – రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 14 – ఇస్లామాబాద్ యునైటెడ్ vs పెషావర్ జల్మి – రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 15 – కరాచీ కింగ్స్ vs లాహోర్ ఖలందర్స్ – నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 16 – ఇస్లామాబాద్ యునైటెడ్ vs ముల్తాన్ సుల్తాన్స్ – రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 18 – కరాచీ కింగ్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్ – నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ

Champions Trophy 2025 : న‌క్క‌తోక తొక్కిన బంగ్లాదేశ్‌.. కోట్ల వ‌ర్షం కురిపించిన వ‌రుణుడు.. కానీ ఇంగ్లాండ్ క‌నిక‌రిస్తేనే..

ఏప్రిల్ 19 – పెషావర్ జల్మి vs ముల్తాన్ సుల్తాన్స్ – రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 20 – కరాచీ కింగ్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్ – నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 21 – కరాచీ కింగ్స్ vs పెషావర్ జల్మి – నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 22 – ముల్తాన్ సుల్తాన్స్ vs లాహోర్ ఖలందర్స్ – ముల్తాన్ క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 23 – ముల్తాన్ సుల్తాన్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్ – ముల్తాన్ క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 24 – లాహోర్ ఖలందర్స్ vs పెషావర్ జల్మి – గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 25 – క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్ – గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 26 – లాహోర్ ఖలందర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్ – గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 27 – క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి – గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 29 – క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్ – గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 30 – లాహోర్ ఖలందర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్ – గడాఫీ స్టేడియం, లాహోర్
మే 1 – ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ – ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 1 – లాహోర్ ఖలందర్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్- గడాఫీ స్టేడియం, లాహోర్
మే 2 – షావర్ జల్మి vs ఇస్లామాబాద్ యునైటెడ్ – గడాఫీ స్టేడియం, లాహోర్
మే 3 – క్వెట్టా గ్లాడియేటర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్ – గడాఫీ స్టేడియం, లాహోర్
మే 4 – లాహోర్ ఖలందర్స్ vs కరాచీ కింగ్స్ – గడాఫీ స్టేడియం, లాహోర్

IND vs NZ : వ‌ర్షం కార‌ణంగా భార‌త్‌, న్యూజిలాండ్ మ్యాచ్ ర‌ద్దైతే.. ప‌రిస్థితి ఏంటి? సెమీస్‌లో ఎవ‌రికి లాభం ?

మే 5 – ముల్తాన్ సుల్తాన్స్ vs పెషావర్ జల్మి – ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 7 – ఇస్లామాబాద్ యునైటెడ్ vs క్వెట్టా గ్లాడియేటర్స్ – రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 8 – కరాచీ కింగ్స్ vs పెషావర్ జల్మి – రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 9 – పెషావర్ జల్మి vs లాహోర్ ఖలందర్స్ – రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 10 – ముల్తాన్ సుల్తాన్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్ – ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 10 – ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్ – రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 13 – క్వాలిఫైయర్ 1 – రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 14 – ఎలిమినేటర్ 1 – గడాఫీ స్టేడియం, లాహోర్
మే 16 – ఎలిమినేటర్ 2 – గడాఫీ స్టేడియం, లాహోర్
మే 18 – ఫైనల్ – గడాఫీ స్టేడియం, లాహోర్