MI vs RCB : ఆఖరి ఓవర్‌లో ఫిల్‌సాల్ట్ అద్భుత ఫీల్డింగ్.. సిక్స్‌గా వెళ్లే బంతిని.. లేదంటే ముంబై గెలిచేది..!
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో విజయాన్ని సాధించింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో విజయాన్ని సాధించింది. సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఆర్‌సీబీ గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ మూడో స్థానానికి దూసుకుపోయింది. ప్రస్తుతం బెంగళూరు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +1.015గా ఉంది.
ఈ మ్యాచ్‌లో బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లి (67; 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లు), రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదగా జితేశ్ శర్మ (40 నాటౌట్; 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశాడు. విఘ్నేశ్ పుతూర్ ఓ వికెట్ సాధించాడు.
Retired Out-Retired Hurt : రిటైర్డ్ ఔట్‌కు రిటైర్డ్ హర్ట్‌కు మధ్య చాలా తేడా ఉంది? ఏంటో తెలుసా?
అనంతరం తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (42; 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.
ఫిల్ సాల్ట్ సూపర్ ఫీల్డింగ్..
ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 6 బంతుల్లో 19 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో మిచెల్ సాంట్నర్, నమన్ ధీర్ లు ఉన్నారు. ఈ ఓవర్‌ను స్పిన్నర్ కృనాల్ పాండ్యా వేశాడు. తొలి బంతికి టిమ్ డేవిడ్ క్యాచ్ అందుకోవడంతో సాంట్నర్ (8) ఔట్ అయ్యాడు. దీపక్ చాహర్ క్రీజులోకి అడుగుపెట్టాడు. కృనాల్ వేసిన బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు.
బంతి దాదాపుగా బౌండరీ లైన్ దాటుతుంది అనగా.. ఆర్‌సీబీ ఫీల్డర్ ఫిల్ సాల్ట్ ఎగిరి బంతిని అందుకున్నాడు. తాను బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ దాటుతున్న విషయాన్ని గ్రహించి వెంటనే బంతిని టిమ్ డేవిడ్ దిశగా విసిరి వేసి అతడు బౌండరీ లైన్ దాటాడు. మరోవైపు టిమ్ డేవిడ్ సైతం బంతిని చక్కగా ఒడిసి పట్టుకోవడంతో దీపక్ చాహర్ గోల్డన్ డకౌట్ అయ్యాడు.
ఒకవేళ సాల్ట్ గనుక ఆ బంతిని అందుకోకపోయుంటే బంతి ఖచ్చితంగా సిక్స్‌గా వెళ్లేది. అప్పుడు ముంబై గెలవడానికి ఛాన్స్ ఉండేది. వికెట్ పడడంతో ముంబై ఒత్తిడి పెరిగింది. దీపక్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
PHIL SALT PULLED OFF SOMETHING INCREDIBLE AT WANKHEDE. 🤯pic.twitter.com/dnVCaAiYZr
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2025
కాగా.. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.