PM Modi : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్.. రోహిత్ సేన‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌..

రోహిత్ సేన‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు.

PM Modi : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్.. రోహిత్ సేన‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌..

PM Modi called to team india and congratulated on winning T20 world cup winning

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్ నిలిచింది. శ‌నివారం బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫికాపై భార‌త్ ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. 17 ఏళ్ల త‌రువాత టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. ఈ క్ర‌మంలో రోహిత్ సేన‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. రోహిత్ శ‌ర్మ నాయ‌త్వం అద్భుతం అంటూ ప్ర‌శంసించారు.

ఫైన‌ల్ మ్యాచులో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని, ఇక ఆఖ‌రి ఓవ‌ర్ వేసిన హార్దిక్ పాండ్య తో పాటు సూప‌ర్ క్యాచ్ అందుకున్న సూర్య‌కుమార్ యాద‌వ్‌, జస్ప్రీత్ బుమ్రాను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇక భార‌త జ‌ట్టుకు కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ చేసిన కృషికి మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Rohit Sharma : ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌రువాత రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు.. మేం కాదు.. ఈ ప్ర‌పంచ‌క‌ప్ అందుకునేందుకు అస‌లైన అర్హుడు అత‌డే..

కాగా.. శ‌నివారం రాత్రి టీమ్ఇండియా మ్యాచ్ గెలిచిన త‌రువాత మోదీ ఓ వీడియో పోస్ట్ చేశారు. దేశ ప్ర‌జ‌లంద‌రి త‌రుపున భార‌త జ‌ట్టుకు అభినంద‌లు తెలిపారు. 140 కోట్ల మంది భార‌తీయులు మీ ఆట‌తీరు ప‌ట్ల గ‌ర్వ‌ప‌డుతున్నార‌న్నారు. ఒక్క మ్యాచుల్లోనూ ఓడిపోకుండా గెల‌వ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌న్నారు. మీరు మైదానంలో ప్రపంచ కప్‌ను గెలుచుకున్నారు. మీరు దేశప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని వీడియోలో మోదీ అన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి (76), అక్ష‌ర్ ప‌టేల్ (47) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో అన్రిచ్ నోర్జే, కేశ‌వ్ మ‌హ‌రాజ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మార్కోజాన్సెన్‌, ర‌బాడ‌లు చెరో ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాప్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52). ట్రిస‌న్ స్ట‌బ్స్ (21 బంతుల్లో 31), క్వింట‌న్ డికాక్ (31 బంతుల్లో 39) రాణించినా ఓట‌మి త‌ప్ప‌లేదు.

T20 WC 2024 Final : టీ20 ఛాంపియ‌న్‌గా భార‌త్‌.. రోహిత్ సేన‌కు ద‌క్కిన‌ ప్రైజ్‌మనీ ఎంతంటే?