ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 6 : టైటిల్ కూత ఎవరిదో

ముంబై : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 6 తుది అంకానికి చేరుకుంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కబడ్డీ లీగ్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్‌లో విజేత ఎవరో తేలనుంది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడునున్నాయి. రాత్రి 8గంటల నుండి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మరోసారి తన సత్తా చాటేందుకు ఉత్సాహం చూపుతోంది. రైడింగ్‌లో బలంగా ఉన్న బెంగళూరు బుల్స్…తామేమి తక్కువ తినలేదని బరిలో ఉన్న గుజరాత్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2015లో బెంగళూరు బుల్స్ ఫైనల్‌కి చేరి రన్నరప్‌గా నిలిచింది. సీజన్ 6లో ఫైనల్ విజేతకు రూ. 3 కోట్లు…రన్నరప్‌కు రూ. 1.80 కోట్లు ప్రైజ్ మనీ అందనుంది. ఈ సీజన్‌లో బెంగళూరు రైడర్స్ 521 పాయింటు్ల…గుజరాత్ రైడర్లు 460 పాయింట్లతో కొనసాగుతోంది. గుజరాత్‌కు సచిన్, ప్రపంజన్, సునీల్…బెంగళూరుకు కెప్టెన్ రోహిత్, పవన్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.