ఇండియా ఓపెన్: క్వార్టర్ ఫైనల్ బరిలో సింధు, కిదాంబి, ప్రణీత్, కశ్యప్

ఇండియా ఓపెన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్లు సొంతగడ్డపై సత్తా చాటుతున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో పీవి సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్స్ బరిలో నిలిచారు. సైనా నెహ్వాల్ ముందుగానే అనారోగ్యం కారణంగా టోర్నీకి హాజరుకాలేనని తెలపడంతో భారత స్టార్ షట్లర్‌లంతా క్వార్టర్ ఫైనల్ బరిలో ఉన్నట్లే.
Read Also : RCBvsMI: ఆ ఒక్క బాల్ మ్యాచ్‌ను మార్చేసింది
ఇదే టోర్నీలో 2017 చాంపియన్‌గా నిలిచిన సింధు మహిళల సింగిల్స్‌లో హాంకాంగ్‌కు చెందిన జోయ్ గ్సువాన్ డెంగ్‌ను 21-11, 21-13 స్కోరుతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌తో తన ఖాతాలో 42 పాయింట్లను దక్కించుకుంది సింధు.
కిదాంబి శ్రీకాంత్ చైనాకు చెందిన లు గువాంజును 21-11, 21-16తో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాడు. దీంతో శ్రీకాంత్ ఖాతాలో 42 పాయింట్లు చేరాయి. పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో ప్రణీత్.. 18-21, 21-16, 21-15తేడాతో సమీర్ వర్మపై గెలిచాడు. కశ్యప్ థాయ్‌లాండ్‌కు చెందిన తానోంగ్‌సాక్‌పై 21-11, 21-13తో గెలిచాడు.
Read Also : సిక్సు కొట్టా.. నా కండలు చూడండి: హార్దిక్ పాండ్యా