PV Sindhu Ambassador : ఐఓసీ అథ్లెట్ అంబాసిడర్‌గా పీవీ సింధు
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు మరో గొప్ప గౌరవం దక్కింది. ఈ ఇద్దరు షట్లర్లు గతేడాది ఏప్రిల్ నుంచి BWF ‘ఐయామ్ బ్యాడ్మింటన్’ అనే ప్రచారానికి ప్రపంచ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు.

Pv Sindhu Named As Athlete Ambassador For Ioc’s ‘believe In Sports’ Campaign
PV Sindhu Believe in Sports : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు మరో గొప్ప గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ ప్రచారానికి సిింధుతో పాటు కెనడా షట్లర్ మిచెల్లె లీ అథ్లెట్ రాయబారులుగా ఎంపికయ్యారని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సోమవారం ప్రకటించింది.
ఈ ఇద్దరు షట్లర్లు గతేడాది ఏప్రిల్ నుంచి BWF ‘ఐయామ్ బ్యాడ్మింటన్’ అనే ప్రచారానికి ప్రపంచ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. ‘నన్ను రాయబారిగా ఐఓసీ ఎంపిక చేయడం నాకు దక్కిన గౌరవం.
పోటీల్లో జరిగే మోసాలపై పోరాటంలో నా సహచర అథ్లెట్లతో కలిసి నిలబడతా. కలిసికట్టుగా మనం బలంగా ఉండగలం’ అని సింధు తెలిపింది. అంబాసిడర్లుగా ఎంపికైన సింధు, లీ.. ఆన్ లైన్ వెబినార్లు, సోషల్ మీడియా సందేశాల ద్వారా బ్యాడ్మింటన్ ప్లేయర్లకు అవగాహన కల్పించనున్నారు.