India vs England : భారత ఓపెనర్లు అదరగొట్టారు..హిట్ మ్యాన్ మెరుపులు
చాలా ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత ఓపెనర్లు అదరగొట్టడంతో రెండో టెస్టులో టీమ్ ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీకి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మెరుపులు తోడవడంతో రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీసేన 3 వికెట్లకు 276 పరుగులు చేసింది.

England V India
India vs England 2nd Test : చాలా ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత ఓపెనర్లు అదరగొట్టడంతో రెండో టెస్టులో టీమ్ ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీకి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మెరుపులు తోడవడంతో రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీసేన 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆట అరగంట ఆలస్యంగా ఆరంభం కాగా.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు.
Read More : CBI : వైఎస్ వివేకా హత్య కేసు..సీబీఐ విచారణ 68వ రోజు
బంతి స్వింగ్ అవుతున్న దశలో చక్కని షాట్స్‌తో స్కోర్ బోర్డ్‌ను పరిగెత్తించారు. రోహిత్ దూకుడు ప్రదర్శించగా.. రాహుల్ ఆచితూచి ఆడాడు. తొలి 50 బంతుల్లో 13 పరుగులే చేసిన రోహిత్.. కరన్ ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి గేర్ మార్చాడు. రెండో సెషన్‌లోనూ జోరు కనబర్చిన రోహిత్ 83 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో రోహిత్ ఔట్ కాగా.. కాసేపటికే పుజారా కూడా వెనుదిరిగాడు.
Read More :TTD : తిరుమలలో గరుడ పంచమి, ఎందుకు నిర్వహిస్తారు ?
గత మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయిన కెప్టెన్ కోహ్లీ ఈ సారి పట్టుదల కనబర్చగా.. రోహిత్ ఔటైన తర్వాత వేగం పెంచిన రాహుల్.. వరుసగా రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మార్క్ వుడ్ బెంబేలెత్తిస్తున్నా.. ఏ మాత్రం తొందరపాటుకు పోకుండా నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. దీంతో భారత్ స్కోరు 200 దాటింది. చక్కటి క్రికెటింగ్ షాట్‌లతో అలరించిన రాహుల్ 212 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా కోహ్లీ స్లిప్‌లో దొరికిపోగా.. ప్రస్తుతం క్రీజులో రహానే, రాహుల్ నిలిచారు.