IPL 2025: ఈ ఓటమి బాధను జీర్ణించుకోవడం కష్టమే.. ఆ ఒక్క తప్పే మా ఓటమికి కారణం.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్

లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఓటమి తరువాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడారు. ఈ ఓటమి బాధను జీర్ణించుకోవటం కాస్త కష్టం.

IPL 2025: ఈ ఓటమి బాధను జీర్ణించుకోవడం కష్టమే.. ఆ ఒక్క తప్పే మా ఓటమికి కారణం.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్

Credit BCCI

Updated On : April 20, 2025 / 7:53 AM IST

RR VS LSG: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాధించింది. లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ చివరి ఓవర్ అద్భుతంగా వేశాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టడంతో మ్యాచ్ లక్నో సొంతమైంది.

Also Read: IPL 2025: అయ్యో గిల్.. అద్భుతమైన త్రోతో శుభ్‌మన్ గిల్‌కు షాకిచ్చిన కరుణ్‌ నాయర్.. వీడియో వైరల్

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. మార్‌క్రమ్‌ (66పరుగులు 45 బంతుల్లో), ఆయుష్ బదోని (50 పరుగులు 34 బంతుల్లో) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్నో జట్టు 180 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు తొలుత రాణించినప్పటికీ చివర్లో తడబాటుకుగురై ఓటమి పాలైంది. రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (74 పరుగులు 52బంతుల్లో) అద్భుత బ్యాటింగ్ చేశారు. రియాన్ పరాగ్ (39 పరుగులు 26బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (34 పరుగులు 20బంతుల్లో) రాణించినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

చివరి ఓవర్లో లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ అద్భుత బౌలింగ్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమిపాలైంది. దీంతో రాజస్థాన్ జట్టు వరుసగా మూడో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో రాజస్థాన్ కు ఇది ఆరో ఓటమి అవ్వడంతో.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

 

మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడారు. ‘‘ఈ ఓటమి బాధను జీర్ణించుకోవటం కాస్త కష్టం. తప్పు ఎక్కడ చేశామో కచ్చితంగా చెప్పలేను. 18-19 ఓవర్ల వరకు మ్యాచ్ లో మేము పోటీలోనే ఉన్నాం. నేను 19వ ఓవర్లోనే ఫినిష్ చేయాల్సింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నాను. నన్ను నేను నిందించుకుంటున్నాను. చివరి ఓవర్లో అదృష్టం కలిసిరాలేదు. మేము వాళ్లను 165-170 పరుగుల వద్ద కట్టడి చేస్తామని అనుకున్నాం. సందీప్ శర్మ పై మాకు నమ్మకం ఉంది. కానీ, అతడికి ఒక బ్యాడ్ గేమ్ ఇది. సమద్ చాలాబాగా ఆడాడు. మేం ఇది ఛేజ్ చేయాల్సిన మ్యాచ్. పిచ్ బాగానే ఉంది. కానీ, ఐపీఎల్ లో కొన్ని బంతులు మాత్రమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి.’’ అని పరాగ్ పేర్కొన్నాడు.