Joe Root and Chahal Dance: మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన చాహల్, జో రూట్.. వీడియో వైరల్

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్స్ రూట్, యుజ్వేంద్ర చాహల్ మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Joe Root and Chahal Dance: మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన చాహల్, జో రూట్.. వీడియో వైరల్

Joe Root and Chahal Dance (Image: Twitter)

Updated On : April 7, 2023 / 2:56 PM IST

Joe Root, Chahal Dance : ఐపీఎల్ – 2023 టోర్నీలో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. కొన్నిజట్ల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు జరుగుతుంది. దీంతో క్రికెట్ ప్రియులు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లు ఆడింది. రెండింటిలో ఒకటి విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది. అయితే, ఈ జట్టు ప్లేయర్లు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్, యుజ్వేంద్ర చాహల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను జట్టు యాజమాన్యం తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

IPL 2023: ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీకి డ్యాన్స్ నేర్పిన షారుక్‌.. పఠాన్ సినిమా పాటతో హోరెత్తిన మైదానం.. వీడియో వైరల్

ఈ వీడియోలో జో రూట్ యుజ్వేంద్ర చాహల్ తో కలిసి ఓ హిందీ పాట ‘భరోసా తేరి ప్యార్ తే’ అనే పాటకు స్టెప్పులేశాడు. తొలుత చాహల్ సెప్టెలేసి చూపించంగా వాటిని అనుసరిస్తూ జో రూట్ వేయటం వీడియోలో కనిపిస్తుంది. ఆ తరువాత ఇద్దరు కలిసి మాస్ స్టెప్పులతో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రూట్ డ్యాన్స్ చూసి నెటిజన్లు కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

 

 

జో రూట్ కోటి రూపాయలకు రాజస్థాన్ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ జోరూట్ ఆడలేదు. క్రికెట్‌లో బ్యాట్‌తో రెచ్చిపోయే రూట్.. తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు.