IND VS ENG : రవీంద్ర జడేజా ఆల్‌టైమ్ రికార్డు.. అండర్సన్ రికార్డ్ బ్రేక్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు.. ఇంకా..
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో జడేజా మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను అందుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పలు ఘనతలను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జడేజా 9 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు జేమ్స్ అండర్సన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇరు దేశాల మధ్య జరిగిన వన్డేల్లో అండర్సన్ 40 వికెట్లు తీయగా.. తాజా మ్యాచ్‌లో మూడు వికెట్లు కలిపి జడేజా 42 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో అండ్రూ ఫింట్లాఫ్, హర్భజన్ సింగ్‌లు ఉన్నారు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
రవీంద్ర జడేజా – 42* వికెట్లు
జేమ్స్ అండర్సన్ – 40 వికెట్లు
అండ్రూ ఫ్లింటాఫ్ – 37 వికెట్లు
హర్భజన్ సింగ్ – 36 వికెట్లు
జవగళ్ శ్రీనాథ్ – 35 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ – 35 వికెట్లు
ALSO READ : IND vs ENG : ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పుష్పరాజ్ ఫీవర్.. తగ్గేదేలే..
600 వికెట్లు..
ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో రవీంద్ర జడేజా 600 వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. టెస్టుల్లో 323, వన్డేల్లో 223, టీ20ల్లో 54 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో అనిల్‌కుంబ్లే 953 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత అశ్విన్, హర్భజన్, కపిల్ దేవ్‌లు ఉన్నారు. భారత్ తరుపున 600 వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ జడేజానే కావడం విశేషం.
6⃣0⃣0⃣ international wickets and counting!
Congratulations, Ravindra Jadeja 🫡🫡
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/Qej9oaRWbb
— BCCI (@BCCI) February 6, 2025
అంతర్జాతీయ క్రికెట్‌లో 600 కు పైగా వికెట్లు తీసిన భారత బౌలర్లు..
అనిల్ కుంబ్లే – 953 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ – 765 వికెట్లు
హర్భజన్ సింగ్ – 707 వికెట్లు
కపిల్ దేవ్ – 687 వికెట్లు
రవీంద్ర జడేజా – 600 * వికెట్లు
ఏకైక భారత స్పిన్నర్..
మరో రికార్డును జడేజా అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీయడంతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌గా రికార్డులకు ఎక్కాడు.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లలో నాలుగో స్థానం..
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యదిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ సిన్నర్ల జాబితాలో జడేజా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య 323 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత షకీబ్, వెటోరీలు ఉన్నారు.
వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు..
సనత్ జయసూర్య (శ్రీలంక) – 323 వికెట్లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 317 వికెట్లు
డేనియల్ వెటోరి (న్యూజిలాండ్) – 305 వికెట్లు
రవీంద్ర జడేజా (భారత్) – 223 వికెట్లు