IPL 2023: బెంగళూరు హెడ్ కోచ్ ఆవేదన.. ఈ జట్టుతో కప్పు కొట్టడం కష్టం.. ఆ ఇద్దరు భారత ఆటగాళ్లు రాణించేనా..?
ఆర్‌సీబీ హెచ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

RCB coach Sanjay Bangar
RCB coach Sanjay Bangar: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( Royal Challengers Bangalore) ఒకటి. 16 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. సీజన్ ప్రారంభమైన ప్రతీ సారి కప్పు మనదే అంటూ ఆ జట్టు అభిమానులు పొంగిపోవడం ఆ తరువాత ఊసురుమనడం కనిపిస్తోంది. ఈ సారి అయినా ఐపీఎల్ విజేతగా ఆర్‌సీబీ నిలుస్తుందని బావించగా కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అష్టకష్టాలు పడుతోంది.
ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచుల్లో గెలిచి 10 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో మూడు మ్యాచ్‌లు రాజస్థాన్, సన్‌రైజర్స్, గుజరాత్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచుల్లో బెంగళూరు విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంది. లేకుంటే మరోసారి ఆ జట్టుకు నిరాశ తప్పదు.
ఈ నేపథ్యంలో ఆ జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గెలవాల్సిన మ్యాచుల్లో ఆర్‌సీబీ ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణమన్నాడు. మహిపాల్ లోమ్రోర్ ఒకటి రెండు మ్యాచుల్లో రాణించినప్పటికీ షెహ్‌బాజ్ అహ్మద్, అనూజ్ రావత్ లు దారుణంగా విఫలం అవుతున్నారన్నారు.
IPL 2023, MI Vs RCB: సూర్య సూపర్ బ్యాటింగ్.. బెంగళూరుని చిత్తు చేసిన ముంబై
వీళ్లకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వృథా చేస్తున్నారని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తమని తాము నిరూపించుకోలేకపోయారన్నాడు. ఇలాంటి జట్టుతో టైటిల్ గెలవడం కాస్త కష్టం అని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో కుర్రాళ్ల విషయంలో కాస్త ఓపిక అవసరం అని అన్నాడు. వాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే మ్యాచ్ విన్నర్లుగా ఎదిగే అవకాశం ఉందన్నాడు. రింకూ సింగ్ విషయంలో కోల్‌కతా మూడు నాలుగేళ్లు సహనంతో ఉండడంతో ఇప్పుడు ప్రతిఫలాలను పొందుతుందని ఊదాహారణగా చెప్పాడు. రజత్ పాటిదార్ లేకపోవడం ఈ సీజన్‌లో తమను నిజంగా బాధించిందన్నాడు.
ఆ ముగ్గురిపైనే ఆధారపడుతున్న బెంగళూరు
బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ లపైనే బెంగళూరు అతిగా ఆధారపడుతోంది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు విఫలం అయినా సరే కుప్పకూలుతోంది. సీనియర్ అయిన దినేశ్ కార్తిక్ ఈ సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోతున్నాడు. యువ ఆటగాడు లోమ్రోర్ రాణిస్తున్నప్పటికి నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా తమ ఆటతీరును మార్చుకుని విజయాల బాట పట్టి అభిమానుల కోరికను బెంగళూరు తీర్చుందో లేదో చూడాలి.