ఆర్సీబీ గుడ్ న్యూస్: గాయంతో రస్సెల్ మ్యాచ్‌కు దూరం

ఆర్సీబీ గుడ్ న్యూస్: గాయంతో రస్సెల్ మ్యాచ్‌కు దూరం

Updated On : April 19, 2019 / 12:31 PM IST

ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభమైన నాటి నుంచి వరుసగా 6 ఓటములు ఎదుర్కొని ఏడో మ్యాచ్‌లో విజయం సాధించింది. మళ్లీ 8వ మ్యాచ్ అదే ఫలితం ఎదుర్కొన్న ఆర్సీబీ పాలిట ఓ గుడ్ న్యూస్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 19న మ్యాచ్ ఆడనుంది. 

ఈ సందర్భంగా ఆర్సీబీకి బాగా కలిసొచ్చే అంశం ఒకటి ఎదురైంది. నైట్ రైడర్స్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ గాయం కారణంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌కు దూరమైయ్యాడు. ప్రముఖ హిట్టర్‌గా మ్యాచ్ ఓడిపోయే పరిస్థితుల్లోనూ విజృంభించి విజయం సాధించే రస్సెల్ ప్రాక్టీస్ చేస్తుండగా తీవ్ర గాయానికి గురైయ్యాడు. 

దీంతో అతనికి వైద్యులు విశ్రాంతి తప్పనిసరి అని సూచించడంతో బెంగళూరుతో జరగాల్సి ఉన్న మ్యాచ్‌కు దూరమైయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే మార్పులు చేపట్టి డేల్ స్టెయిన్‌ను జట్టులోకి చేర్చుకోవడంతో కొద్దిపాటి బలంగా కనబడుతున్నట్లుంది. లీగ్ పట్టికలో ఆర్సీబీ ఆఖరి స్థానంలో ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.