ఆర్సీబీ మహిళా జట్టు విజయంతో బెంగళూరు వీధుల్లో యువత సంబురాలు.. వీడియోలు వైరల్

బెంగళూరులోని నగర వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నగరం మొత్తం మారుమోగిపోయింది.

ఆర్సీబీ మహిళా జట్టు విజయంతో బెంగళూరు వీధుల్లో యువత సంబురాలు.. వీడియోలు వైరల్

WPL 2024 Winner RCB

WPL 2024 Winner : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు టోర్నీ విజేతగా నిలిచింది. ఐపీఎల్ లో ఆర్సీబీ ఉమెన్స్ జట్టు సాధించ‌లేనిది డబ్ల్యూపీఎల్ లో స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ మహిళల జట్టు సాధించింది. ఆదివారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై మహిళల ఆర్సీబీ జట్టు గెలిచింది. ఫైనల్ లో ఆర్సీబీ మహిళల జట్టు విజయంతో బెంగళూరులోని నగర వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నగరం మొత్తం మారుమోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో నగర వాసులు వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. డ్యాన్సులు చేస్తూ తమ ఉత్సాహాన్ని తెలియజేశారు.

RCB

Also Read : WPL 2024: టైటిల్ విజేత ఆర్సీబీకి ఎన్ని కోట్ల ప్రైజ్ మ‌నీ వ‌చ్చిందో తెలుసా?

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ ఎన్నడూ టైటిల్ గెలుచుకోలేదు. కానీ, డబ్ల్యూపీఎల్ ట్రోపీని ఆర్సీబీ మహిళల జట్టు గెలుచుకోవటం గమనార్హం. ఈ మెగా టోర్నీలో ఆర్సీబీ ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ రఫ్పాడించింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై నాలుగు వికెట్లతో రాణించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమెకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది. ఎల్లీస్ పెర్రీ, స్పిన్నర్లు శ్రేయాకం పాటిల్, సోఫీ మోలినెక్స్ ల అద్భుతమైన బౌలింగ్ తోడుకాగా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో టైటిల్ విన్నర్ గా నిలిచింది.