RCBvsMI: ఆ ఒక్క బాల్ మ్యాచ్‌ను మార్చేసింది
ఉత్కంఠ పరిస్థితుల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 6పరుగుల తేడాతో గెలిచింది.

ఉత్కంఠ పరిస్థితుల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 6పరుగుల తేడాతో గెలిచింది.
ఉత్కంఠ పరిస్థితుల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 6పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ ఉత్కంఠత కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో అంపైర్ చాలా పెద్ద తప్పే చేశాడు.
Read Also : నా కండలు చూడండి : పాండ్యా సిక్స్ ప్యాక్
చివరి బాల్‌ను లసిత్ మలింగ్ నో బాల్ వేసినట్లు క్లియర్‌గా కనిపిస్తున్నా కరెక్ట్ గానే కౌంట్ చేశాడు. అప్పటికీ మంచి దూకుడుమీద ఉన్న డివిలియర్స్ ఒక్క సిక్స్ బాదితే మ్యాచ్ ఫలితం మారిపోయేది. స్ట్రైకింగ్‌లో ఉన్న శివం దూబెకు లసిత్ మలింగ 19.6 బంతి విసిరాడు. లైన్ దాటి బంతి విసిరిన మలింగను అంపైరింగ్ చేస్తున్న ఎస్ రవి.. పట్టించుకోలేదు. అప్పటికే కోహ్లీ మ్యాచ్ ఓడిపోయినట్లు ఫిక్స్ అయిపోయాడు.
ఈ నోబాల్ విషయంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అంపైరింగ్ తీరుతో పాటు, కోహ్లీ నిర్లక్ష్యాన్ని ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్నారు. బెంగళూరు జట్టులో డివిలియర్స్ ఒంటరిపోరాటం ఫలించకపోవడంతో లీగ్‌లో ఆ జట్టుకు రెండో ఓటమికి గురి కావాల్సి వచ్చింది.
— Liton Das (@BattingAtDubai) March 28, 2019