Cricketers Favourite Food : ఈ క్రికెటర్లకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ..
మనం మనకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఎలా లాగించేస్తామో.. అవకాశం వచ్చినపుడు మన క్రికెటర్లు కూడా తమకి ఇష్టమైన ఫుడ్ తింటారు. ఫిట్‌నెస్ పాటిస్తూనే మన క్రికెటర్లు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో తెలుసా?

Cricketers Favourite Food
Cricketers favourite food : క్రికెటర్స్ అనగానే చాలా డైట్ పాటిస్తారు.. వర్కవుట్లు చేస్తారు.. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇదంతా సరే.. కానీ వాళ్లకు కూడా అందరిలాగే ఇష్టమైన ఫుడ్ ఉంటుంది. అది ఇంట్లో ప్రిపేర్ చేసేదైనా.. బయట తినేదైనా.. అలా మన ఇండియన్ క్రికెటర్లు అవకాశం వస్తే ఎంతో ఇష్టంగా తినే బయటి ఫుడ్ ఏంటో తెలుసా? చదవండి.
విరాట్ కోహ్లీ చాలామటుకు బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తాడట. చోళే బతురే అంటే ప్రాణమట. ఢిల్లీ రాజౌరీ గార్డెన్‌లో ఉన్న రామ్‌కి హోటల్‌కి వెళ్లి అక్కడ ఇచ్చే ఉల్లిపాయ, పచ్చిమిర్చి చట్నీతో తినడం అంటే మహా ఇష్టమట. ప్రత్యేకంగా చోళే బతూరే తినడానికి విరాట్ కోహ్లీ ఢిల్లీ వెళ్లిన సందర్భాలు ఉన్నాయట. రోహిత్ శర్మకి పావ్ బాజీ, వడా పావ్, భేల్ పూరీ చాలా ఇష్టమట. అలాగే ముద్దపప్పు, ఆవకాయ అన్నం అంటే కూడా అంతే ఇష్టమట. చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ మొత్తం స్ట్రీట్ ఫుడ్ తినడానికి రోహిత్ శర్మ ఖర్చు పెట్టేవాడట. ఇప్పుడు ఫిట్‌నెట్ కోసం స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉన్నా ఏ మాత్రం అవకాశం వచ్చి ముంబయి చౌపాటీలో ఓ షాపులో తనకి ఇష్టమైనవి లాగించి వస్తాడట.
శ్రేయస్ అయ్యర్‌కి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. అపోలో ఫిష్, క్రిస్పీ ప్రాన్స్‌తో పాటు చెన్నైలో కొబ్బరి పాలతో చేసే చేపల కూర అద్భుతంగా ఉంటుందని చెప్పాడు శ్రేయస్ అయ్యర్. చెన్నై వెళ్లినప్పుడల్లా ఆ చేపల కూర రుచి చూడకుండా రాడట. కేఎల్ రాహుల్‌కి మసాలా దోశ అంటే ఇష్టమట. ఇంట్లో వేసే మసాలా దోశ కంటే రోడ్డు పక్కన వేసే మసాలా దోశలు తినడం అలవాటట. పానీ పూరి, పిజాలు కూడా ఆపకుండా తినేస్తాడట. ఎయిర్ పోర్టులో నడిచి వెళ్తున్నప్పుడు స్టాల్స్‌లో ఎవరైనా తింటూ కనిపిస్తే తనకి నోరూరిపోతుందట.
2028 LA Olympics : లాంఛనం పూర్తి.. ఒలింపిక్స్‌లో క్రికెట్.. 128 ఏళ్ల తరువాత
హార్దిక్ పాండ్యాకి పావ్ బాజీపై చీజ్ వేసుకుని తినడం చాలా ఇష్టమట. ఫిట్‌నెస్ ట్రైనర్ అనుమతితో వారంలో ఒకసారి ఇలా లాగించేస్తాడట. అలా చేయడం వల్ల ఓ గంట అడిషనల్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేస్తాడట. ఫలూదా, చైనీస్ స్టైల్లో చేసే ఎగ్ నూడుల్స్ కూడా ప్రాణమట. సూర్యకుమార్ యాదవ్ చైనీస్ ఆమ్లెట్ ఎన్ని పెట్టినా లాగించేస్తాడట. అలాగే ట్రిపుల్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంటే కూడా చాలా ఇష్టమట. ఇషాన్ కిషన్ పక్కనుంటే ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్లి ఓ పట్టు పడతారట. సో ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే మరోవైపు సమయం దొరికినపుడు ఇలా మన క్రికెటర్లు నచ్చిన ఫుడ్ తింటారన్నమాట.