2028 LA Olympics : లాంఛ‌నం పూర్తి.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. 128 ఏళ్ల త‌రువాత‌

లాంఛ‌నం పూర్తి అయ్యింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమైంది. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జ‌రుగుతున్న ఒలింపిక్స్‌లో కొత్త‌గా ఐదు గేమ్స్‌కు స్థానం క‌ల్పించారు.

2028 LA Olympics : లాంఛ‌నం పూర్తి.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. 128 ఏళ్ల త‌రువాత‌

Cricket In Olympics

Cricket In 2028 LA Olympics : లాంఛ‌నం పూర్తి అయ్యింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమైంది. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జ‌రుగుతున్న ఒలింపిక్స్‌లో కొత్త‌గా ఐదు గేమ్స్‌కు స్థానం క‌ల్పించారు. అందులో క్రికెట్ కూడా ఒక‌టి. క్రికెట్‌తో పాటు బేస్‍బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్‍బాల్, స్క్వాష్, లాక్రోస్‍ లు కూడా ఒలింపిక్స్‌లో చోటు ద‌క్కించుకున్నాయి.

2028లో లాస్ ఏంజిల్స్ వేదిక‌గా జ‌రిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు మ‌రో నాలుగు ఆట‌ల‌ను ప్రవేశ పెట్టాల‌ని నిర్వాహ‌కులు ప్ర‌తి పాదించారు. ఇందుకు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ(ఐఓసీ) ఎగ్జిక్యూటీవ్ బోర్డు శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 13న‌) ఆమోదం తెలిపింది. దీనిపై నేడు (సోమ‌వారం అక్టోబ‌ర్ 16న‌) ఓటింగ్ జ‌రిగింది. బోర్డు స‌భ్యుల్లో ఇద్ద‌రు మాత్ర‌మే వ్య‌తిరేకంగా ఓటు వేయ‌గా మిగిలిన అంద‌రూ మ‌ద్ద‌తు తెలుప‌డంతో ఒలింపిక్స్‌లో కొత్త‌గా ఐదు ఆట‌ల‌ను చేర్చేందుకు ఆమోదం ల‌భించింది. ఈ విష‌యాన్ని ఐఓసీ అధ్య‌క్షుడు థామ‌స్ బాచ్ చెప్పారు.

Rashid Khan : ఢిల్లీ ప్ర‌జ‌ల‌ పై అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ కామెంట్స్‌.. వైర‌ల్

కాగా.. 2028 ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల క్రికెట్ ను నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు ఉండ‌గా టీ20 ఫార్మాట్‌లోనే నిర్వ‌హించ‌నున్నారు. ఆరు జ‌ట్ల‌తోనే క్రికెట్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు లాస్ ఏంజిల్స్ నిర్వాహ‌కులు తెలిపారు. అయితే.. అప్ప‌టికీ మ‌రికొన్ని జ‌ట్లు చేరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

128 సంవ‌త్స‌రాల త‌రువాత‌..

1900లో పారిస్ వేదిక‌గా నిర్వ‌హించిన ఒలింపిక్స్ క్రీడ‌ల్లో క్రికెట్‌ను మొద‌టి సారి చేర్చారు. ఆ త‌రువాత మ‌రే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడ‌లేదు. అదే మొద‌టి సారి చివ‌రి సారి అయ్యింది. కాగా.. ఇప్పుడు ఆమోదం ల‌భించ‌డంతో 128 ఏళ్ల త‌రువాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి.

Rohit Sharma : నా కండ‌లు చూశావా..? అంపైర్‌తో రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్