Rishabh Pant: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ధోనీ రికార్డును అధిగమించిన రిషబ్ పంత్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు. తద్వారా టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా

Rishabh Pant
IND vs NZ 1st Test Match: బెంగళూరు వేదికగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ (52), కోహ్లీ (70) పరుగులతో రాణించగా.. యువ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ 90 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో పంత్ సరికొత్త రికార్డును నమోదు చేశారు.
Also Read: IND vs NZ: యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవీంద్రలను అభినందించిన సచిన్ టెండుల్కర్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు. తద్వారా టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 2,500 పరుగులు పూర్తి చేసిన భారత వికెట్ కీపర్ గా పంత్ రికార్డుకెక్కాడు. మహేంద్ర సింగ్ ధోనీ 69 ఇన్నింగ్స్ లలో 2500 పరుగుల మైలురాయిని చేరుకోగా.. రిషబ్ పంత్ కేవలం 62 ఇన్నింగ్స్ లోనే 2500 పరుగుల మైలురాయిని అధిగమించి ధోనీ రికార్డును అధిగమించాడు. భారత్ క్రికెట్ లో మరో దిగ్గజ ఆటగాడు ఫరోఖ్ ఇంజనీర్ గతంలో 82 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డును నెలకొల్పాడు.