ఇంగ్లాండ్‌లో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కానిది..
ఈ సిరీస్‌లో రిషబ్ పంత్ ఇప్పటికే 450 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇంగ్లాండ్‌లో నిలకడైన ఆటతీరు కనబర్చుతున్నాడు.

భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్‌లో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1,000 పరుగులు చేసిన ఫస్ట్ విజిటింగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. ఈ సిరీస్‌లో రిషబ్ పంత్ ఇప్పటికే 450 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇంగ్లాండ్‌లో నిలకడైన ఆటతీరు కనబర్చుతున్నాడు.
ఇంగ్లాండ్‌లో విజిటింగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా అత్యధిక పరుగులు చేసినవారు వీరే..
1004* పరుగులు- రిషబ్ పంత్ (ఇండియా)
778 పరుగులు- ఎమ్మెస్ ధోనీ (ఇండియా)
773 పరుగులు- రాడ్ మార్ష్ (ఆస్ట్రేలియా)
684 పరుగులు- జాన్ వైట్ (దక్షిణాఫ్రికా)
624 పరుగులు- ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా)
విదేశంలో 1,000 టెస్ట్ పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా పంత్ నిలిచాడు. అలాగే, ఆస్ట్రేలియాలో 879 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డ్ నెలకొల్పాడు.
Also Read: రిషబ్ పంత్ కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిల.. కాలు ఉబ్బిపోయి నడవలేని స్థితిలో..
టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా అత్యధిక సిక్సులు
16* – రిషబ్ పంత్, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2025
12 – డెనిస్ లిండ్సే, ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ దక్షిణాఫ్రికా 1966/67
12 – ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్ 2005
కాగా, మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచులో తొలి రోజు ఆటలో భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సమయంలో అతడి కాలికి బంతి బలంగా తగిలి గాయమైంది. దీంతో పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.