రిషబ్ పంత్ స్టేడియంలో పిల్లల్ని వదలట్లేదు

రిషబ్ పంత్ స్టేడియంలో పిల్లల్ని వదలట్లేదు

Updated On : April 13, 2019 / 9:13 AM IST

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు బేబీ సిట్టర్ అంటూ పేరు తెచ్చుకున్నాడు. ఆసీస్ ప్లేయర్ టిమ్ పైనె కొడుకును ఎత్తుకుని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పంత్.. ఐపీఎల్‌లోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రాక్టీస్‌లో మరో పిల్లాడితో విన్యాసాలు చేశాడు. 

ఏప్రిల్ 12శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు అదే జట్టు హిట్టర్ ధావన్ కొడుకు జరోవర్‌తో పంత్ సరదాగా కాసేపు ఆడుకున్నాడు. ఓ టవల్‌లో ఆ బుడ్డోడ్ని పెట్టి గిరగిరా తిప్పేశాడు. 

అది సరదా కోసమే చేసినా.. ట్విట్టర్‌లో దీనిపై వ్యతిరేక స్పందన వస్తోంది. పంత్ మరీ క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా పంత్ చేతికి పిల్లాడ్ని ఇచ్చేముందు ఓ సారి ఆలోచించమని ఆస్ట్రేలియా ప్లేయర్ టిమ్ పైనెకు సూచిస్తున్నారు. 

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 7బంతులు ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది.