Riyan Parag : రియాన్ ప‌రాగ్ ఔటా? నాటౌటా?.. వివాదాస్ప‌ద నిర్ణ‌యం త‌రువాత ఆర్ఆర్ బ్యాట‌ర్ అసంతృప్తి.. సోష‌ల్ మీడియాలో..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట్స్‌మెన్ రియాన్ ప‌రాగ్ ఔట్ కు సంబంధించి వివాదం చెల‌రేగింది.

Riyan Parag : రియాన్ ప‌రాగ్ ఔటా? నాటౌటా?.. వివాదాస్ప‌ద నిర్ణ‌యం త‌రువాత ఆర్ఆర్ బ్యాట‌ర్ అసంతృప్తి.. సోష‌ల్ మీడియాలో..

Courtesy BCCI

Updated On : April 10, 2025 / 12:02 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకోవాల‌ని భావించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు నిరాశే ఎదురైంది. బుధ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ 58 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 217 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయి సుదర్శ‌న్ (82; 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. జోస్ బ‌ట్ల‌ర్ (36), షారుక్ ఖాన్ (36)లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్ పాండే, మ‌హేశ్ తీక్ష‌ణ చెరో రెండు వికెట్లు తీశారు. జోప్రా ఆర్చ‌ర్‌, సందీప్ శ‌ర్మ‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

PBKS vs CSK : చెన్నై పై విజ‌యం.. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్‌కు బీసీసీఐ షాక్..

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ 19.2 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆర్ఆర్ బ్యాట‌ర్ల‌లో షిమ్రాన్ హెట్మెయర్ (52; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), సంజు శాంస‌న్ (41; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు. య‌శ‌స్వి జైస్వాల్ (6), నితీశ్ రాణా (1), ధ్రువ్ జురెల్ (5) లు విఫ‌లం అయ్యారు. ప్ర‌సిద్ద్ కృష్ణ మూడు వికెట్లు తీశాడు. ర‌షీద్ ఖాన్‌, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సిరాజ్‌, అవేశ్ ఖాన్‌, కుల్వంత్ ఖేజ్రోలియా లు త‌లా ఓ వికెట్ సాధించారు.

రియాన్ ప‌రాగ్ ఔటా? నాటౌటా?

ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట్స్‌మెన్ రియాన్ ప‌రాగ్ ఔట్ కు సంబంధించి వివాదం చెల‌రేగింది. ఆర్ఆర్ ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుల్వంత్ ఖేజ్రోలియా ఈ ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని ప‌రాగ్ థ‌ర్డ్ మ్యాన్ దిశ‌గా షాట్ ఆడాల‌ని అనుకున్నాడు. బంతి వికెట్ కీప‌ర్ చేతుల్లోకి వెళ్లింది. వెంట‌నే గుజ‌రాత్ ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.

CSK Playoffs Scenario : వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో ఓట‌మి.. చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఛాన్సుందా? ఇంకా ఎన్ని మ్యాచ్‌ల్లో గెల‌వాలంటే..?

వెంట‌నే రియాన్ ప‌రాగ్ స‌మీక్ష తీసుకున్నాడు. బంతి బ్యాట్‌ను దాటినప్పుడు స్పైక్ ఉందని రీప్లేలు చూపించాయి.  థర్డ్ అంపైర్‌ కూడా బంతి బ్యాట్‌ను తాకిందని నిర్ధారించి ఔట్ ఇచ్చాడు. అయితే.. బంతి బ్యాట్‌ను తాకలేదని, బ్యాట్‌ మైదానాన్ని తాకడంతో శబ్దం వచ్చిందని పరాగ్‌.. ఫీల్డ్‌లో ఉన్న అంపైర్‌తో వాదించాడు. బంతి బ్యాట్‌ను తాకలేదనీ, గ్రౌండ్‌ను తాకడంతో స్పిక్నోమీటర్‌లో స్పైక్స్‌ వచ్చాయన్నాడు. అయినా పరాగ్‌ వాదనను అంపైర్ వినలేదు. మైదానం నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. దీంతో నిరాశ‌గా ప‌రాగ్ మైదానాన్ని వీడాడు.

ప్ర‌స్తుతం రియాన్ ప‌రాగ్ ఔట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు ప‌రాగ్ ఔట్ అని అంటుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం నాటౌట్ అని చెబుతున్నారు. మొత్తానికి ప‌రాగ్ ఔట్ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.