French Open 2021 : ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నా – ఫెదరర్
487 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు. టోర్నీలో విజయాల దిశగా దూసుకెళుతున్న ఈ స్విస్ స్టార్‌కు మోకాలి గాయం తిరగబెట్టడంతో ఈ డెసిషన్ తీసుకున్నారు.

French Open 2021
Roger Federer : 487 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు. టోర్నీలో విజయాల దిశగా దూసుకెళుతున్న ఈ స్విస్ స్టార్‌కు మోకాలి గాయం తిరగబెట్టడంతో ఈ డెసిషన్ తీసుకున్నారు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేసినప్పటికీ.. టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే ఫెదరర్ నాలుగో రౌండ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించేందుకే ఫెడెక్స్ మొగ్గుచూపారు. ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకుంటున్నట్లు.. ఇలాంటి సమయంలో తన శరీరాన్ని మరింత ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై తన టీంతో లోతుగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారాయన.
కొన్ని నెలల క్రితం రెండు మోకాలి శస్త్రచికిత్సలు చేయించుకున్న ఫెదరర్ ఆట నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నారు. 2015 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫెదరర్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక 30 జనవరి 2020లో చివరిసారిగా ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఫెదరర్ ఆడారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో సెర్బియన్ స్టార్ నోవక్ జకోవిక్‌పై ఓటమిపాలయ్యారు. మోకాలి గాయంతో గతేడాది ఆటకు దూరమైన ఫెదరర్… 2016లో వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత రెండేళ్లు క్లేకోర్టుపై జరిగే మ్యాచ్‌లకు దూరంగా ఉంటూ గ్రాస్ కోర్టులపై జరిగే మ్యాచ్‌లపై ఫోకస్ చేశారాయన. ఇక వింబుల్డన్ టోర్నీకి ముందు జూన్ 14న హాలేలో జరిగే గ్రాస్ కోర్టు టోర్నమెంటులో ఫెదరర్ ఆడనున్నారు.
Read More : Mehul Choksi : చికిత్స కోసమే…అమెరికా వచ్చా, తనను ప్రశ్నించొచ్చు – చోక్సీ