Video: ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతలుగా భారత్‌లో అడుగుపెట్టిన క్రికెటర్లు.. రోహిత్‌ చుట్టూ చేరి ఫ్యాన్స్‌ ఏం చేశారో చూడండి..

ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు టీమిండియా ఫ్యాన్స్‌ భారీగా చేరుకుని రోహిత్‌కు స్వాగతం పలికారు.

Video: ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతలుగా భారత్‌లో అడుగుపెట్టిన క్రికెటర్లు.. రోహిత్‌ చుట్టూ చేరి ఫ్యాన్స్‌ ఏం చేశారో చూడండి..

Updated On : March 11, 2025 / 9:43 AM IST

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో విజేతలుగా భారత క్రికెటర్లు స్వదేశంలో అడుగుపెట్టారు. వారికి విమానాశ్రయాల్లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. రోహితీ శర్మ తన కుటుంబంతో ముంబైకి చేరుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు టీమిండియా ఫ్యాన్స్‌ భారీగా చేరుకుని రోహిత్‌కు స్వాగతం పలికారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రోహిత్ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. రన్ చేజ్‌లో అతడి అర్ధ శతకం భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. టీమిండియా ఓపెనర్‌గా దిగిన రోహిత్‌ 76 పరుగులు చేసిన టీమిండియా విజయాన్ని సుగమం చేశాడు.

రోహిత్ ముంబైకి రావడంతో అభిమానులు చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రోహిత్‌కి షేక్ హ్యాండ్‌ ఇవ్వడానికి అతడితో సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్‌ ఎగబడడంతో పోలీసులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకున్నారు.

మరోవైపు, మిగతా భారత ఆటగాళ్లు కూడా స్వదేశానికి చేరుకున్నారు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఫ్యాన్స్‌ స్వాగతం పలికారు. భారత క్రికెటర్ ఆక్షర్ పటేల్ అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 గెలుచుకుని భారత్‌లో అడుగుపెట్టిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియాకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official)