Rohit Sharma: కొడుకు పేరును వెల్లడించిన రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే.. అభిమానులు ఏమన్నారంటే..

టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కుమారుడి పేరును వెల్లడించారు.

Rohit Sharma: కొడుకు పేరును వెల్లడించిన రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే.. అభిమానులు ఏమన్నారంటే..

Rohit Sharma Family

Updated On : December 2, 2024 / 10:23 AM IST

Rohit Sharma New Born Son Name: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే గతనెల 15వ తేదీన రెండవ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రితికా సజ్దే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కుమారుడి పేరును వెల్లడించారు. అహాన్ అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. రితికా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో భార్యాభర్త, ఇద్దరు పిల్లలు కలిగిన కుటుంబంకు సంబంధించిన బొమ్మను షేర్ చేశారు. బొమ్మలోని నలుగురు క్రిస్మస్ నేపథ్యంతో కూడిన డ్రస్ ను ధరించినట్లుగా ఉంది. ఒక్కో బొమ్మపై కుటుంబ సభ్యుల పేర్లతో రోహిత్, రితికా, సామీ (సమైరా), అహాన్ పేర్లను రాశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: WTC: ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకొచ్చిన సౌతాఫ్రికా

రోహిత్ శర్మ, రితికా సజ్దే 2015 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. 2018 డిసెంబర్ 30న రితికా పాపకు జన్మించింది. పాపకు సమైరా అని పేరుపెట్టారు. గత నెల రితికా రెండో కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బాబుకు అహాన్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. మొదటి టెస్టు పెర్త్ లో జరగ్గా.. ఇండియా ఘన విజయం సాధించింది. అయితే, ఈ పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరయ్యాడు. రితికా మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆమె వెంటే రోహిత్ ఉన్నాడు.  గత నాలుగు రోజుల క్రితం రోహిత్ ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ టీం సభ్యులతో చేరాడు. రెండో టెస్టు ఈనెల 6 నుంచి మొదలు కానుండగా.. రోహిత్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది.

Ritika Sajdeh

రోహిత్ సతీమణి రితికా సజ్దే సోషల్ మీడియాలో పోస్టులో తమ కుమారుడి పేరు వెల్లడిస్తూ ఫొటో షేర్ చేయడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ అని కొందరు పేర్కొనగా.. న్యూ కెప్టెన్ శర్మ వచ్చేశాడని కొందరు సోషల్ మీడియాలో తమదైన రీతిలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.