Rohit Sharma : సిక్స‌ర్ల కింగ్ రోహిత్.. క్రిస్ గేల్ రికార్డు బ‌ద్ద‌లు.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Rohit Sharma : సిక్స‌ర్ల కింగ్ రోహిత్.. క్రిస్ గేల్ రికార్డు బ‌ద్ద‌లు.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

Rohit Sharma breaks Chris Gayles world record

Rohit Sharma breaks Chris Gayles world record : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘ‌నత‌ అందుకున్నాడు. ఈ క్ర‌మంలో వెస్టిండీస్ బ్యాట‌ర్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి రోహిత్ 473 ఇన్నింగ్స్‌ల్లో 554 సిక్స‌ర్లు బాదాడు. క్రిస్‌గేల్ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్స‌ర్లు కొట్టాడు.

Virat Kohli : న‌వీన్ ఉల్ హ‌క్ ర‌నౌట్ ఛాన్స్‌ను మిస్ చేసిన రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ వైర‌ల్‌

అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

రోహిత్ శర్మ (భార‌త్‌) – 554*
క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) – 553
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్‌) – 476
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్‌) – 398
మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్‌) – 383

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వేగంగా 1000 ప‌రుగులు

ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ వ్య‌క్తిగ‌త స్కోరు 23 ప‌రుగు వ‌ద్ద ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో నిలిచాడు. వార్న‌ర్‌, రోహిత్‌లు చెరో 19 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. వీరిద్ద‌రి త‌రువాత స‌చిన్ టెండూల్క‌ర్ (20 ఇన్నింగ్స్‌ల్లో), ఏబీ డివిలియ‌ర్స్ ఉన్నారు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 19 ఇన్నింగ్స్‌ల్లో
డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) -19 ఇన్నింగ్స్‌ల్లో
స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 20 ఇన్నింగ్స్‌ల్లో
ఏబి డివిలియ‌ర్స్ (ద‌క్షిణాఫ్రికా) – 20 ఇన్నింగ్స్‌ల్లో
వివ్ రిచ‌ర్డ్స్ (వెస్టిండీస్) – 21 ఇన్నింగ్స్‌ల్లో
సౌర‌వ్ గంగూలీ (భార‌త్‌) – 21 ఇన్నింగ్స్‌ల్లో
మార్క్ వా (ఆస్ట్రేలియా)- 22 ఇన్నింగ్స్‌ల్లో
హెర్షెల్ గిబ్స్ (ద‌క్షిణాఫ్రికా) – 22 ఇన్నింగ్స్‌ల్లో