Ashwin : అక్షర్ పటేల్ గాయం.. అశ్విన్‌కు వరంగా మారనుందా..? రోహిత్ చెప్పింది అదేనా..?
ఆసియా కప్ 2023 ముగిసింది. టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ఇక స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం భారత జట్టు సిద్ధం కావాల్సి ఉంది.

Axar-Ashwin
Ravichandran Ashwin : ఆసియా కప్ 2023 ముగిసింది. టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ఇక స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం భారత జట్టు సిద్ధం కావాల్సి ఉంది. ఈ మెగా టోర్నీ కన్నా ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ను టీమ్ఇండియా (Team India) ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించగా భారత్ ఇంకా వెల్లడించలేదు. ఆసియా కప్ సూపర్-4 దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో భారత ఆటగాడు అక్షర్ పటేల్ ( Axar patel) గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అక్షర్ స్థానంలో ఫైనల్ మ్యాచ్ కోసం వాష్టింగ్టన్ సుందర్‌ను తీసుకున్నారు.
ఇప్పుడు అక్షర్ పటేల్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ప్రపంచకప్ ఆడుతాడా అన్న సందేహం నెలకొంది. ఈ క్రమంలో సీనియర్ స్పిన్నర్ అయిన అశ్విన్ ను తీసుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన సమాధానం ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది
ఆసియా కప్ ఫైనల్‌కు వాషింగ్టన్ సుందర్‌ను పిలిచినప్పటికీ, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌ను ప్రపంచ కప్‌కు దూరం చేయడం లేదని రోహిత్ పేర్కొన్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ ఎప్పటికీ తమ దృష్టిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అశ్విన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడుతున్నానని వెల్లడించాడు. చివరి నిమిషంలో అక్షర్ పటేల్ గాయపడడంతో వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండడంతో అతడి పిలిపించినట్లు తెలిపాడు. సుందర్ ఆసియా గేమ్స్ కోసం బెంగళూరులో నిర్వహిస్తున్న క్యాంప్‌లో ఉన్నాడు. అందుకనే వెంటనే అతడిని కొలొంబోకు పిలిపించాం అని రోహిత్ అన్నాడు.
Mohammad Siraj : సిరాజ్‌కు ఓ ఎస్‌యూవీ ఇవ్వండి.. ఆనంద్ మహీంద్రా ఎమన్నారంటే..?
ఒకవేళ అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోకుంటే సీనియర్ స్పిన్నర్ అయిన అశ్విన్ కు ప్రపంచకప్ ఆడేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అశ్విన్ ను ఎదుర్కొనడం ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.