PBKS vs MI : పంజాబ్ కింగ్స్‌తో కీలక మ్యాచ్.. గబ్బర్ రికార్డు పై కన్నేసిన రోహిత్ శర్మ..
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఈ కీలక మ్యాచ్ ముందు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది.
నేటి మ్యాచ్‌లో రోహిత్ 23 పరుగులు చేస్తే.. పంజాబ్ పై అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్‌ను అధిగమిస్తాడు. పంజాబ్ పై ధావన్ 894 పరుగులు చేయగా రోహిత్ శర్మ 872 పరుగులు చేశాడు.
Rinku Singh : రింకూ సింగ్‌ను పెళ్లిచేసుకోబోతున్న ప్రియా సరోజ్ ఎవరు ?
ఇక పంజాబ్ పై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు పంజాబ్ పై 1134 పరుగులు చేశాడు. ఆ తరువాత 1104 పరుగులలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్‌లో పంజాబ్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
డేవిడ్ వార్నర్ – 1134 పరుగులు
విరాట్ కోహ్లీ – 1104 పరుగులు
శిఖర్ ధావన్ – 894 పరుగులు
రోహిత్ శర్మ – 872 పరుగులు
ఫాఫ్ డుప్లెసిస్ – 831 పరుగులు
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రాణించాడు. 81 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా.. 2013 తర్వాత ఓ సీజన్‌లో రోహిత్ శర్మ నాలుగు హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-2లో విజయం సాధించిన జట్టు ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకుంటుంది. జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కప్పు కోసం పోటీపడనుంది.