Rohit sharma : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు.. సిక్సర్ల కింగ్‌గా నిలవాలంటే..?
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ (Rohit sharma)ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.

Rohit sharma need 8 more sixes to create history in odis
Rohit sharma : అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ఆసీస్‌తో సిరీస్‌కు చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో సత్తా చాటాలని ఆరాటపడుతున్నాడు. ఈ సిరీస్ కోసం దాదాపు 10 కేజీలు తగ్గాడు.
కాగా.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ మరో ఎనిమిది సిక్సర్లు బాదితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది.
అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే 273 వన్డేల్లో 344 సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరి తరువాత ఈ జాబితాలో క్రిస్‌గేల్, జయసూర్య, ధోని ఉన్నారు.
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు
* రోహిత్ శర్మ (భారత్) – 273 వన్డేల్లో 344 సిక్సర్లు
* క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 301 మ్యాచ్‌ల్లో 331 సిక్సర్లు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 445 మ్యాచ్‌ల్లో 270 సిక్సర్లు
* ఎంఎస్ ధోని (భారత్) – 350 మ్యాచ్‌ల్లో 229 సిక్సర్లు
భారత్, ఆసీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – అక్టోబర్ 19 ( పెర్త్)
* రెండో వన్డే – అక్టోబర్ 23 (అడిలైడ్)
* మూడో వన్డే – అక్టోబర్ 25 (సిడ్నీ)