Rohit sharma : థ్యాంక్యూ రోహిత్ శర్మ.. వన్డే కెప్టెన్‌గా ఎన్ని మ్యాచ్‌ల్లో విజయాలను అందించాడో తెలుసా?
టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit sharma) ప్రయాణం ముగిసింది.

Rohit sharma ODI Captain journey his biggest achievements
Rohit sharma : టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రయాణం ముగిసింది. అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit sharma) ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు? ఎన్ని మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది? ఎన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయింది? హిట్‌మ్యాన్ సాధించిన ఘనతలు ఏంటో ఓ సారి చూద్దాం.
విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. రోహిత్ నాయకత్వంలో భారత్ 56 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 42 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అతడి విజయశాతం 76గా ఉంది. టీమ్ఇండియా అత్యుత్తమ వన్డే కెప్టెన్లలో రోహిత్ ఒకడిగా నిలిచాడు.
రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీలో గొప్ప క్షణాలు ఇవే..
* 2018లో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఆసియాకప్‌ను అందించాడు.
* 2021 డిసెంబర్‌లో పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా నియమితులయ్యాడు.
* 2023లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్‌లోనూ భారత్‌ను గెలిపించాడు.
* 2023 ప్రపంచకప్‌లో రోహిత్ నాయకత్వంలో భారత్ అసాధారణంగా ఆడింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా పైనల్‌కు చేరుకుంది. అయితే.. ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
* దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ2025 ని గెలుచుకుంది.
THE LEGACY OF ROHIT SHARMA IN ODIS. pic.twitter.com/ElcGNM7nYz
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2025
అంతేకాదండోయ్.. టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్‌ను సైతం రోహిత్ శర్మ అందించాడు. అతడి నాయకత్వంలోనే భారత్ టీ20 ప్రపంచకప్ 2024ను సొంతం చేసుకుంది.