Rohit Sharma : హిట్‌మ్యాన్ షో.. 166 రన్స్ చేసిన రోహిత్ శర్మ.. 16 ఇన్నింగ్స్.. నెట్టింట ట్రోల్స్..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పూర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు.

Rohit Sharma poor form continues he Got Out Cheaply In 1st ODI against England
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ తన పూర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. 7 బంతులు ఎదుర్కొని రెండు అంటే రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌ను సాకిబ్ మహమూద్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని హిట్‌మ్యాన్ ప్లిక్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. మిస్‌టైమింగ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో ఇంగ్లాండ్ ఫీల్డర్ లియామ్ లివింగ్ స్టోన్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పై నెట్టింట మరోసారి ట్రోలింగ్ మొదలైంది. మ్యాగి చేసుకునే లోపల రోహిత్ ఔట్ అయిపోతాడు అని, రిటైర్‌మెంట్ ప్రకటిస్తే మంచిదని కామెంట్లు చేస్తున్నారు.
Like this Post if you think Rohit Sharma should retire asap. pic.twitter.com/OnqKaeALjv
— Krishna. (@KrishVK_18) February 6, 2025
16 ఇన్నింగ్స్‌లు 166 రన్స్..
మొత్తంగా 2024/25 సీజన్‌లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలం అయ్యాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 10.37 సగటుతో 166 పరుగులు మాత్రమే చేశాడు. 2024/25 సీజన్‌లో మూడు పార్మాట్లలో రోహిత్ శర్మవరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9, 2గా ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. ఫిలిప్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) లు రాణించారు. హ్యారీ బ్రూక్ (0), లిమాయ్ లివింగ్ స్టోన్ (5), జో రూట్ (19) లు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు.