Rohit Sharma : వెస్టిండీస్‌పై శ‌త‌కం.. ప‌లు రికార్డుల‌ను అందుకున్న రోహిత్ శ‌ర్మ‌.. అవేంటో తెలుసా..?

డొమినికా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (103) శ‌త‌కంతో ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్ ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Rohit Sharma : వెస్టిండీస్‌పై శ‌త‌కం.. ప‌లు రికార్డుల‌ను అందుకున్న రోహిత్ శ‌ర్మ‌.. అవేంటో తెలుసా..?

Rohit Sharma

Rohit Sharma records : డొమినికా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (103) శ‌త‌కంతో ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్ (Rohit Sharma)ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శ‌ర్మ‌కు టెస్టు క్రికెట్‌లో ఇది ప‌దో సెంచ‌రీ. ఈ క్ర‌మంలోనే టెస్టుల్లో 3,500 ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. మూడు ఫార్మాట్లు(వన్డేలు, టెస్టులు, టీ20లు)ల్లో ఈ మైలురాయిని అందుకున్న రెండో భార‌త బ్యాట‌ర్‌గా రోహిత్ నిలిచాడు.

WI vs IND 1ST Test : వెస్టిండీస్ పేస‌ర్‌ను బూతులు తిట్టిన య‌శ‌స్వి జైశ్వాల్‌..! కోహ్లి రియాక్ష‌న్ ఏంటంటే..?

ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి త‌రువాత హిట్‌మ్యాన్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఇక టెస్టుల్లో 3,500 ప‌రుగులు మార్క్‌ను దాటిన 20వ భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో కోహ్లి(8,479), పుజారా (7,195), అజింక్య ర‌హానే(5,066)లు మాత్ర‌మే రోహిత్ కంటే ముందు ఉన్నారు.

స్టీవ్ స్మిత్ ను స‌మం చేసిన రోహిత్‌

తాజా శ‌త‌కంతో మూడు ఫార్మాట్ల‌లో రోహిత్ సెంచ‌రీలు 44కి చేరుకున్నాయి. వ‌న్డేల్లో 30, టీ20ల్లో 4, టెస్టుల్లో 10 శ‌త‌కాల‌ను రోహిత్ సాధించాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్(Steve Smith) స‌ర‌స‌న చేరాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స్టీవ్ స్మిత్ కూడా 44 సెంచ‌రీలు చేశాడు. టెస్టుల్లో 32 శ‌త‌కాలు చేయ‌గా వ‌న్డేల్లో 12 సెంచ‌రీలు చేశాడు. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో విరాట్ కోహ్లి(75), జో రూట్‌(46), డేవిడ్ వార్న‌ర్‌(45)లు మాత్ర‌మే శ‌త‌కాల‌లో రోహిత్ క‌న్నా ముందు ఉన్నారు.

Yashasvi Jaiswal : చ‌రిత్ర సృష్టించేందుకు మ‌రో 57 ప‌రుగుల దూరం

రోహిత్ శ‌ర్మ 51 టెస్టుల్లో 86 ఇన్నింగ్స్‌ల్లో 45.97 సగటుతో 3,540 పరుగులు చేశాడు. ఇందులో ప‌ది సెంచ‌రీలు, ఓ డ‌బుల్ సెంచ‌రీ, 14 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.