రొనాల్డో అది చూపించాడని రూ.15.64లక్షల జరిమానా

రొనాల్డో అది చూపించాడని రూ.15.64లక్షల జరిమానా

Updated On : March 21, 2019 / 4:17 PM IST

చాంపియన్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హాట్రిక్ గోల్స్ బాదేసి ప్రియురాలి కంట ఆనంద భాష్పాలు వచ్చేలా చేసిన రొనాల్డొపై భారీ నష్టపరిహారం విధించింది ఆ లీగ్ యాజమాన్యం. మార్చి 12 మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జ్యూవెంటస్ జట్టు 3 గోల్స్ చేసి అట్లెటికొ మాడ్రిడ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 
 
జ్యూవెంటస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రొనాల్డొ ఒక్కడే 3గోల్స్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. అయితే విజయోత్సవ సంబరాల్లో భాగంగా అర్జున్ రెడ్డి సినిమాలో గోల్ కీపర్ గా నిల్చొన్న విజయ్ దేవరకొండ చూపించిన మాదిరిగా ప్రత్యర్థి జట్టుకు ఆ భాగాన్ని చూపిస్తూ సైగలు చేశాడు. 

అలాంటి స్టార్ ప్లేయర్ ఇటువంటి అసభ్యకర చేష్టలు చేయడం తమకు నచ్చట్లేదని మనో భావాలు దెబ్బతీసేలా ప్రవర్తించాడని అట్లెటికో కోచ్ డిగో సిమోన్ ఫిర్యాదు చేశాడు. దాంతో రొనాల్డొపై యూఈఎఫ్ఏ చాంపియన్ లీగ్ యాజమాన్యం 20వేల యూరోలు(అంటే రూ. 15.65లక్షలు) జరిమానా విధించింది. స్పెయిన్‌లో ముగిసిన మ్యాచ్‌కు తర్వాతి మ్యాచ్ వచ్చే నెల జరగనుంది.