సెంచరీతో చెలరేగిపోయిన రిషబ్ పంత్.. హాఫ్ సెంచరీ బాదిన మిచెల్ మార్ష్

నేటి మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

సెంచరీతో చెలరేగిపోయిన రిషబ్ పంత్.. హాఫ్ సెంచరీ బాదిన మిచెల్ మార్ష్

Pic: @IPL (X)

Updated On : May 27, 2025 / 9:54 PM IST

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్లేఆఫ్‌లో ఆ జట్టుకు క్వాలిఫయర్ 1లో ఆడే అవకాశం వస్తుంది. మరోవైపు, ప్లేఆఫ్ నుంచి ఇప్పటికే లక్నో వైదొలిగింది.

నేటి మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించి నిర్ణీత 20 ఓవర్లలో 227/3 పరుగులు చేశారు.

మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ దూకుడుగా ఆడారు. మిచెల్ మార్ష్ – 67, మాథ్యూ బీరిట్జ్ – 14, రిషబ్ పంత్ – 118 (నాటౌట్), నికోలస్ పూరన్ – 13, అబ్దుల్ సమద్ – 1 (నాటౌట్) పరుగు తీశారు. ఆర్సీబీ బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

Also Read: మూడు పార్టీల్లోనూ అగ్రనేతలకు లీడర్ల లేఖాస్త్రాలు.. ఎందుకంటే?

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
మిచెల్ మార్ష్, మాథ్యూ, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషార, సుయాష్ శర్మ