RRvMI: రాజస్థాన్ కొట్టేసింది..

RRvMI: రాజస్థాన్ కొట్టేసింది..

Updated On : April 13, 2019 / 2:13 PM IST

టెన్షన్ లేదు.. ప్రశాంతంగా లక్ష్యాన్ని చేధించేశారు రాజస్థాన్ ప్లేయర్లు. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్.. ఓపెనర్లు దాదాపు సగానికి పైగా ఆటను పూర్తి చేసేశారు. అజింకా రహానె(37; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), జోస్ బట్లర్(89; 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు)తో చెలరేగడంతో లక్ష్యం చేధించడం సులువైపోయింది. 

సూర్య కుమార్ యాదవ్(16), కీరన్ పొలార్డ్(6)పరుగులతో సరిపెట్టుకోగా మరోసారి జట్టు సంక్లిష్టంలో పడింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన హార్దిక్ పాండ్యా(28) చెలరేగగా ఇషాన్ కిషన్(5), కృనాల్ పాండ్యా(0)లతో కలిసి విజయాన్ని రాబట్టారు. 

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. ఓపెనర్లు రోహిత్ శర్మ(47; 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), డికాక్ (81; 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు)తో శుభారంభాన్ని అందించారు. 

వారి దెబ్బకు పరుగులు పెట్టిన స్కోరు బోర్డును సూర్య కుమార్ యాదవ్(16), కీరన్ పొలార్డ్(6), హార్దిక్ పాండ్యా(28), ఇషాన్ కిషన్(5), కృనాల్ పాండ్యా(0) పరవాలేదనిపించే స్కోరుతో ముగించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3)వికెట్లు పడగొట్టగా, ధావల్ కుల్ కర్ణి, జయదేశ్ ఉనదక్త్ చెరో వికెట్ తీయగలిగారు.