RRvsMI: రాజస్థాన్ టార్గెట్ 162

RRvsMI: రాజస్థాన్ టార్గెట్ 162

Updated On : April 20, 2019 / 12:21 PM IST

రాజస్థాన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైను రాజస్థాన్ ఘోరంగా కట్టడి చేసింది. ఆరంభం నుంచి ముంబైపై ఒత్తిడి పెంచి స్కోరు బోర్డుకు కళ్లెం వేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు నష్టపోయి 161పరుగులు చేయగలిగింది. 
Also Read : BCCI విలక్షణ తీర్పు : పాండ్యా..రాహుల్‌కు రూ. 20 లక్షల ఫైన్

ఓపెనర్‌గా దిగిన క్వింటన్ డికాక్(65) ఒక్కడే జట్టుకు చక్కని స్కోరు అందించగలిగాడు. 14.3ఓవర్లు వరకూ నిలిచిన డికాక్‌.. శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ తొలి వికెట్‌గా రోహిత్ శర్మ(5)పరుగులు మాత్రమే చేసి శ్రేయాస్ చేతికి చిక్కాడు. 

ఆ తర్వాత మూడో వికెట్ గా బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్(34)ను స్టువర్ట్ బిన్నీబౌలింగ్‌లో ధావల్ కుల్కర్ణి క్యాచ్ అందుకోవడంతో వికెట్ చేజిక్కించుకుంది రాజస్థాన్. హార్దిక్ పాండ్యా(23), కీరన్ పొలార్డ్(10), బెన్ కటింగ్(13), కృనాల్ పాండ్యా(2)లు మాత్రమే చేయగలిగారు. శ్రేయాస్ గోపాల్ 2 వికెట్లు దక్కించుకోగా, స్టువర్ట్ బిన్నీ, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉన్దక్త్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు.