Ruturaj Gaikwad : ఐపీఎల్‌కు దూరమైన తరువాత.. తొలిసారి స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్సీ విషయంలో షాకింగ్ కామెంట్స్
రుతురాజ్ ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ruled Out CSK Captain Ruturaj Gaikwad Seen Playing Football In Viral Video
మోచేతి గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2025 మిగిలిన సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి ఎంఎస్ ధోని అందుకున్నాడు. ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా సీజన్ నుంచి వైదొలగడం చెన్నైకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
‘రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. నొప్పితోనే అతడు మరో రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఎక్స్‌రేలో ఏమీ స్పష్టంగా తేలలేదు. అయితే.. మోచేయి విరిగినట్లు ఎమ్మరై స్కాన్‌లో కనిపించింది. అతడికిలా జరిగినందుకు ఎంతో బాధగా ఉంది. నొప్పి ఉన్నా సరే ఆడేందుకు ప్రయత్నించడాన్ని మెచుకోవాల్సిందే. కానీ అతడు ఈ సీజన్‌కు ఇక దూరం అయ్యాడు.’ అని కోచ్ ఫ్లెమింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
RCB vs DC : రజత్ పాటిదార్ కెప్టెన్సీ పై కోహ్లీ అసంతృప్తి..? దినేశ్ కార్తీక్‌తో సుదీర్ఘ సంభాషణ..
Injured Ruturaj gaikwad playing football currently. pic.twitter.com/dNJgQ7Dn4S
— Juylov Vladislav (@juylov_vlad) April 10, 2025
అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రుతురాజ్ ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. దీనిపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కావాలనే రుతురాజ్‌ను కెప్టెన్సీ నుంచి దించివేశారా? అతడి గాయం నిజం కాదా అని కామెంట్లు పెడుతున్నారు. అయితే.. ఈ వీడియో ఇప్పటిదేనా, పాతదా అన్నది తెలియాల్సి ఉంది.
ధోని మరోసారి కెప్టెన్సీ అందుకోవడం పై రుతురాజ్ స్పందన..
ఐపీఎల్ 2025 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడం కాస్త నిరుత్సాహానికి గురి చేస్తోందని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. మోచేతి గాయం కారణంగా ఆడలేకపోతున్నానని తెలిపాడు. తనకు మద్దతు నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఇది సవాల్‌తో కూడిన సీజన్ అని వెల్లడించాడు. అయితే.. తమ జట్టులో ఓ యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడని, అతడు జట్టును ముందుకు తీసుకువెళతాడని చెప్పాడు.
‘చెన్నై విజయాల బాట పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కొన్ని అంశాలు మన చేతుల్లో ఉండవు. డగౌట్ నుంచి మద్దతు ఇస్తూనే ఉంటా. కఠిన పరిస్థితుల నుంచి జట్టు బయటపడడం చూడాలని ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో సమిష్టిగా ఆడి సీజన్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నాను.’ అని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.