Ruturaj Gaikwad : లక్నో పై చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం.. అరుదైన ఘనత
ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో శతకం నమోదైంది. మంగళవారం చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు.

screengrab from video posted on x by@IPL
ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో శతకం నమోదైంది. మంగళవారం చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 56 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మంది బ్యాటర్లు సెంచరీలు చేశారు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లి, సునీల్ నరైన్, జోస్ బట్లర్, రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, యశస్వి జైస్వాల్ లు శతకాలు బాదారు. వీరిలో బట్లర్ రెండు సెంచరీలు బాదాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్; 60 బంతుల్లో 12 ఫోర్లు, 3సిక్సర్లు) విధ్వంసకర శతకం బాదగా, శివమ్ దూబె (66; 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో మాట్ హెన్రీ, మొహ్సిన్ ఖాన్, యష్ ఠాకూర్ లు తలా ఓ వికెట్ తీశారు.
Irfan Pathan : ఇంకా కొందరు ముంబై ప్లేయర్లు రోహితే కెప్టెన్ అని భావిస్తున్నారు : ఇర్ఫాన్ పఠాన్
అరుదైన ఘనత..
తాజా శతకంతో రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మురళీ విజయ్, షేన్ వాట్సన్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
చెన్నై తరుపున అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్లు వీరే..
మురళీ విజయ్ – 2
షేన్ వాట్సన్ – 2
రుతురాజ్ గైక్వాడ్ – 2
మైఖేల్ హస్సీ – 1
బ్రెండన్ మెకల్లమ్ – 1
సురేష్ రైనా – 1
అంబటి రాయుడు -1
Sourav Ganguly : గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. కోహ్లి 40 బంతులు ఆడితే.. ఓపెనర్‌గా మాత్రం..