సైనా ఔట్: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్‌లో తప్పని ఓటమి

సైనా ఔట్: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్‌లో తప్పని ఓటమి

Updated On : March 8, 2019 / 11:22 AM IST

అంతర్జాతీయంగా బ్యాడ్మింటన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ నుంచి సైనా కూడా నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో గాయంతో బరిలోకి దిగిన తాయ్ జు యింగ్‌ చేతిలో పోరాడిన సైనా ఓడింది. 15-21, 19-21తో క్వార్టర్ ఫైనల్స్ బరిలో చేతులెత్తేసింది. 
Also See: INDvAUS: హమ్మయ్య ఒక్క వికెట్ పడింది

ప్రి క్వార్టర్స్‌లో ముందు తడబడిన సింధు ఆ తర్వాత మంచి పోటీనే ఇచ్చింది. గురువారం జరిగిన ఈ పోటీలో సైనా తొలిరౌండ్‌‌లో 21–17, 21–18తో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్మోర్‌పై విజయంతో టోర్నీలో విజయాన్ని నమోదు చేసింది.  8–21తో తొలిగేమ్‌ను హోజ్‌మా‌ర్క్‌ చేతిలో కోల్పోయినా.. త్వరగానే కోలుకుని చెలరేగింది. 2015 ఫైనల్ ప్లేయర్ అయిన సైనా రెండో గేమ్‌లో దూకుడుగా ఆడింది. 

బర్మింగ్‌హామ్ వేదికగా బుధవారం జరిగిన ఈ పోటీలో తొలి రౌండ్లోనే సంగ్ జి హ్యూన్ చేతిలో 16-21, 22-20, 18-21లతో ఓడిపోయి తిరుగుముఖం పట్టింది. 
Also See: INDvAUS: విజృంభించిన ఆస్ట్రేలియా, భారత్‌కు భారీ టార్గెట్