Sara Tendulkar – Shubman Gill : శుభమన్ గిల్, సారా టెండూల్కర్ బ్రేకప్..? ఆ నటినే కారణమా..?
భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రేమకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

sara tendulkar and shubman gill breakup rumors
క్రికెట్‌కు, బాలీవుడ్‌కు చాలా కాలంగా సంబంధం ఉంది. బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఇక క్రికెటర్లు, హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉంటాయి. భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రేమకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. వీటిపై వారిద్దరూ ఎప్పుడు స్పందించలేదు. అయినప్పటికి సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరినొకరు ఫాలో చేసుకోవడం, పోస్టులకు కామెంట్లు చేయడం వంటివి అభిమానుల్లో ఆసక్తిని రెకెత్తించాయి.
IPL 2025 : ఈడెన్ గార్డెన్స్‌లో హర్షా భోగ్లే, సైమన్ డౌల్ కామెంట్రీపై నిషేధం! అసలు కారణం అదేనా?
అయితే.. తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఈ క్రమంలో ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసుకున్నారని తెలుస్తోంది.
ఇందుకు కారణం గిల్ ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ టచ్‌లోకి వెళ్లాడమేనట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి అవనీత్ కౌర్. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమ్ఇండియా ఆడే చాలా మ్యాచ్‌లకు హాజరవుతూ ఆమె మద్దతు ఇచ్చింది.
వాస్తవానికి గిల్ పుట్టిన రోజు అవనీత్ కౌర్ శుభాకాంక్షలు తెలిపింది. అంతకముందు కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. అయితే.. ఆ సమయంలో అతడితో పాటు ఇతర స్నేహితులు సైతం ఉన్నారు.