Shahid Afridi : బాబర్ ఆజం వాట్సప్ చాట్ లీక్.. సహనం కోల్పోయిన షాహిద్ అఫ్రిది..! పీసీబీ ఛైర్మన్ ఇలా చేస్తే..
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస పరాజయాలతో ఢీలా పడింది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాంపై అభిమానులు మండిపడుతున్నారు

Shahid Afridi Loses Cool
Shahid Afridi Loses Cool : వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస పరాజయాలతో ఢీలా పడింది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాంపై అభిమానులు మండిపడుతున్నారు. అటు బాబర్ ఎంత ప్రయత్నించినా పీసీబీ ఛైర్మన్ స్పందించడం లేదంటూ వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో అతడి వ్యక్తిగత వాట్సప్ చాట్ లీక్ కావడంతో బాబర్ వివాదాల్లో చిక్కుకున్నాడు. అయితే.. బాబర్‌కు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది మద్దతుగా నిలిచాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జకా అష్రఫ్.. బాబర్ అజామ్ కాల్‌కు సమాధానం ఇవ్వడం లేదనే ఊహాగానాల మధ్య ఒక పాకిస్థాన్ న్యూస్ ఛానెల్ కెప్టెన్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఈ చాట్‌లో బాబర్ పీసీబీ ఛైర్మన్‌కు కాల్ చేయలేదని విషయం ఉంది. అయితే.. లీకైన చాట్ నిజంగా బాబర్ చేసిందా..? కాదా అన్నది ఇంకా ధ్రువీకరణ కాలేదు.
మండిపడ్డ అఫ్రిది..
కాగా..జకా అష్రఫ్, బాబర్ ఆజం ల ఇద్దరి మధ్య ఏమీ జరిగింది అనేది వారి వ్యక్తిగత విషయం. అయితే.. పాకిస్తాన్ కెప్టెన్ వ్యక్తిగత వాట్సాప్ చాట్ మీడియాలో లీక్ అయిన విషయం పై అఫ్రిది మండిపడ్డాడు.
Virat Kohli : విరాట్ కోహ్లీలో వరుణ్ తేజ్‌కు నచ్చే అంశం ఏమిటో తెలుసా..?
‘ఇది సిగ్గుచేటు.. మన దేశం పరువును మనమే తీస్తుకుంటున్నాం.. మన ఆటగాళ్ల పరువును మనమే తీసుకుంటున్నాం.. ఒకరి వ్యక్తిగత మెసేజ్‌లను టీవీల్లో ఎలా చూపిస్తారు.. అది కూడా మన కెప్టెన్ మెసేజ్‌లా..? అని ఓ టీవీ ఛాన్‌ల్‌తో మాట్లాడుతూ అఫ్రిది అన్నాడు. ఇలాంటి పని ఎవరు చేసినా తప్పే. అది పీసీబీ ఛైర్మన్ అయినా ఇంకొకరు అయినా.. అని అన్నాడు.
బాబర్ ఆజంకు జాకా అష్రఫ్ మధ్య విభేదాలు ఉన్నాయని రషీద్ లతీఫ్ చెబుతున్నాడు. అందుకనే కెప్టెన్ ఫోన్ చేస్తుంటే స్పందించడం లేదని అంటున్నారు. ఈ లీకేజీ వ్యవహారాన్ని షోయబ్ బయటకు తెచ్చినట్లు తాను భావిస్తున్నట్లు అఫ్రిది చెప్పుకొచ్చాడు. అతడు ఎందుకు ఇలా చేశాడు..? ఇలా చేయమని ఛైర్మన్ అతడికి చెప్పారా..? ఒక వేళ ఛైర్మన్ అలా చెప్పి ఉంటే అది నిజంగా చెత్త పని అఫ్రిది మండిపడ్డాడు.
‘Main yeh kahunga yeh ghatiya harkat hay, bohat hi ghatiya harkat hay. Kisi ka private message kis trah dikha sakte hain TV pe aur wo bhi captain ka? Humaray players ko khud itna badnaam kar rahe hain. Agar chairman ne bhi yeh harkat ki hay toh bohat ghatiya harkat hay’ – Shahid… pic.twitter.com/49oAXk7F3E
— Farid Khan (@_FaridKhan) October 30, 2023
పాకిస్తాన్ మాజీ స్పిన్ గ్రేట్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ క్లిష్ట సమయాల్లో అతనికి ఎవరు అండగా నిలిచారు, అతనికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారో బాబర్ గుర్తుంచుకుంటాడని చెప్పాడు. ప్రదర్శనల ఆధారంగానే వ్యక్తులను విమర్శిస్తాం తప్పితే వ్యక్తిగతంగా కాదని ముస్తాక్ అహ్మద్ తెలిపాడు.