క్రికెటర్ల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా షేన్ వాట్సన్

క్రికెటర్ల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా షేన్ వాట్సన్

Updated On : November 12, 2019 / 9:05 AM IST

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా క్రికెటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. పాట్ కమిన్స్, క్రిస్టెన్ బీమ్స్, క్రికెట్ కామెంటేటర్ లిసా స్టాలేకర్ లాంటి కొత్త సభ్యులతో పాటు ఉన్న 10మంది బోర్డు సభ్యుల్లో షేన్ వాట్సన్ సభ్యత్వం పొడిగించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన షేన్ వాట్సన్ ‘ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం గౌరవంగా అనిపిస్తోంది. నా ముందు చాలా పెద్ద బాధ్యతలు ఉంచారు. ఈ అవకాశం దక్కినందుకు చాలా ఉద్వేగంగా ఉన్నాను. క్రికెట్ కోసం మరింత కష్టపడటానికి అవకాశం దొరికింది’ 

‘మహిళా క్రికెట్లోనూ కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. గతంలో మాదిరి కాకుండా క్రికెట్ కు ఇంటి నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. నా కూతురిలా క్రికెట్ ఇష్టపడే శఆళ్లు మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను’ అని షేన్ వాట్సన్ తెలిపాడు. 

ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్ 59 టెస్టులు, 190 వన్డేలు, 58టీ20లు ఆడాడు. గత వారం ఆస్ట్రేలియా క్రికెట్  క్రికెట్ బోర్డు డైరక్టర్‌గా మాజీ క్రికెటర్ మెలనీ జోన్స్ ను ఎన్నుకుంది.